Business Idea: జస్ట్ రూ.10 వేల పెట్టుబడితో ఇంట్లోనే ఉంటూ చేసే బిజినెస్! ఉమెన్స్ కోసం స్పెషల్..
చాలా మంది మహిళలు ఇంటి నుంచే తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలని అనుకుంటారు. అటువంటి వారికి హోమ్‌మేడ్ ఫుడ్/స్నాక్స్ వ్యాపారం ఒక మంచి అవకాశం. కేవలం రూ.10,000 పెట్టుబడితో ప్రారంభించి, నెలకు రూ.20,000-రూ.30,000 వరకు సంపాదించవచ్చు. ఇంటి భోజనానికి డిమాండ్ పెరుగుతోంది, కాబట్టి నాణ్యమైన ఉత్పత్తులతో మంచి లాభాలు పొందవచ్చు.

చాలా మంది మహిళలకు ఇంట్లోనే ఉంటూ ఏదైనా బిజినెస్ చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండాలని అనుకుంటారు. అలాగే వారికి కూడా ఆర్థికంగా కాస్త ధైర్యం ఉంటుంది. అలాంటి వారి కోసం ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంట్లోనే ఉండి తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే మంచి వ్యాపారాల్లో హోమ్‌మేడ్ ఫుడ్ / స్నాక్స్ తయారీ వ్యాపారం ఒకటి. కేవలం రూ.10,000 పెట్టుబడితో ఈ వ్యాపారం మొదలు పెట్టవచ్చు. ప్రత్యేకంగా మహిళలకు ఇది అనుకూలమైన, లాభదాయకమైన వ్యాపారం.
ఇటీవలె కాలంలో హోమ్‌మేడ్, హైజీనిక్ ఆహారానికి మంచి డిమాండ్ ఉంది. ఉద్యోగస్తులు, విద్యార్థులు, సింగిల్ లివింగ్ చేసే వారు ఇంటివంట రుచిని ఇష్టపడుతున్నారు. పులిహోర, బిర్యానీ, పచ్చళ్ళు, కారప్పొడి, లడ్డూలు, మురుకులు, చక్కిలిగింజలు, మిల్లెట్ స్నాక్స్ వంటి ఉత్పత్తులు మంచి మార్కెట్ కలిగి ఉన్నాయి.
ప్రారంభ ఖర్చు
రూ.10,000లో గ్యాస్ స్టౌ, పాత్రలు, ముడిసరుకు, ప్యాకింగ్ కవర్లు, లేబుల్స్ కొనుగోలు చేయవచ్చు. మొదట చిన్న స్థాయిలో ఆర్డర్లతో ప్రారంభించాలి. కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారా ప్రచారం చేయవచ్చు. వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్ పేజీలు, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేయవచ్చు. స్థానిక కిరాణా దుకాణాలు, హోమ్ డెలివరీ యాప్‌లతో కూడా టైఅప్ అవ్వొచ్చు. కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ తీసుకుని రుచి, నాణ్యత మెరుగుపరచాలి.
లాభం ఎంత?
రోజుకు 20–30 ఆర్డర్లు వచ్చినా నెలకు రూ.20,000–30,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. పండుగల సమయంలో ఆర్డర్లు పెరిగితే మరింత లాభం వస్తుంది. స్వల్ప పెట్టుబడి, ఇంటి నుంచే పని, సమయ నియంత్రణ – ఇవన్నీ కలిపి ఈ వ్యాపారాన్ని మహిళలకు ఉత్తమ ఎంపికగా నిలబెడుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
