AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన రూ.100 శ్రీలంకలో ఎంతో తెలుసా? టూరిస్టులకు పండగలాంటి వార్త!

శ్రీలంక పర్యటనకు భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ద్వీప దేశానికి వెళ్లే ముందు కరెన్సీ మారకం (INR నుండి LKR), స్థానిక ఖర్చులు, వాతావరణం గురించి తెలుసుకోవాలి. భారత రూపాయికి 3.35 శ్రీలంక రూపాయలు లభిస్తాయి (తేదీ మారవచ్చు). ఆహారం, రవాణా అందుబాటు ధరల్లో ఉంటాయి.

మన రూ.100 శ్రీలంకలో ఎంతో తెలుసా? టూరిస్టులకు పండగలాంటి వార్త!
100 Rupee Note
SN Pasha
|

Updated on: Mar 26, 2026 | 5:38 PM

Share

చాలా మందికి సరదాగా టూర్‌కి వెళ్లడం అంటే ఇష్టం. ముఖ్యంగా విదేశీ పర్యటనలపై భారతీయులకు ఆసక్తి ఎక్కువ. సహజ సౌందర్యం, చారిత్రక వారసత్వం, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ అవకాశాల కారణంగా శ్రీలంకకు చాలా మంది వెళ్తుంటారు. సముద్ర తీరాలు, పర్వత ప్రాంతాలు, పురాతన కోటలు, అలాగే కోలంబో, జఫ్ఫానా వంటి నగరాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అయితే శ్రీలంకకు వెళ్లే ముందు అక్కడి కరెన్సీ మారకపు విలువ గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం. అక్కడ ఉపయోగించే కరెన్సీ ‘శ్రీలంక రూపాయి’ (LKR). 2026 మార్చి 26 నాటికి 1 భారత రూపాయి (INR) సుమారుగా 3.35 శ్రీలంక రూపాయలకు సమానం.

అంటే 100 భారత రూపాయలు సుమారుగా 335 శ్రీలంక రూపాయల వరకు వస్తాయి. అయితే ఈ మారకపు రేట్లు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. పర్యటన ప్రణాళికలో భాగంగా కరెన్సీ విలువతో పాటు స్థానిక ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. శ్రీలంకలో ఆహారం, రవాణా, నివాస ఖర్చులు సాధారణంగా భారతదేశంతో పోలిస్తే కొంతవరకు అందుబాటులోనే ఉంటాయి. ముఖ్యంగా స్థానిక మార్కెట్లు, చిన్న హోటళ్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగిస్తే ఖర్చులను నియంత్రించవచ్చు.

అదనంగా వాతావరణ పరిస్థితులను కూడా గమనించాలి. శ్రీలంకలో రెండు మాన్సూన్ సీజన్లు ఉండటం వల్ల ఏ ప్రాంతానికి ఎప్పుడు వెళ్లాలో ముందుగా నిర్ణయించుకోవడం మంచిది. సరైన సమయాన్ని ఎంచుకుంటే పర్యటన మరింత సుఖదాయకంగా ఉంటుంది. మొత్తంగా శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు కరెన్సీ మారకపు రేట్లు, వాతావరణం, స్థానిక ఖర్చులపై అవగాహన కలిగి ఉంటే, ప్రయాణం సులభంగా, ఆర్థికంగా ప్రయోజనకరంగా మారుతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us