Hyundai: త్వరలో స్టాక్ మార్కెట్‌లో ఐపీవో జాతర..అతి పెద్ద కంపెనీ షేర్ల విక్రయం..!

|

Sep 28, 2024 | 4:15 PM

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారందరికీ శుభవార్త. త్వరలో ఐపీవో జాతర జరగనుంది. ఒక పెద్ద కంపెనీ షేర్లను కొనుగోలు చేసే అద్భుత అవకాశం లభించనుంది. స్టాక్ మార్కెట్ లోకి వచ్చే కంపెనీల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. వాటిలో పెట్టుబడి పెట్టడానికి గల అవకాశాలను పరిశీలిస్తారు. ఆయా కంపెనీలకు చెందిన స్టాక్ లను కొనుగోలు చేస్తారు.

Hyundai: త్వరలో స్టాక్ మార్కెట్‌లో ఐపీవో జాతర..అతి పెద్ద కంపెనీ షేర్ల విక్రయం..!
Stock Market
Follow us on

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారందరికీ శుభవార్త. త్వరలో ఐపీవో జాతర జరగనుంది. ఒక పెద్ద కంపెనీ షేర్లను కొనుగోలు చేసే అద్భుత అవకాశం లభించనుంది. స్టాక్ మార్కెట్ లోకి వచ్చే కంపెనీల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. వాటిలో పెట్టుబడి పెట్టడానికి గల అవకాశాలను పరిశీలిస్తారు. ఆయా కంపెనీలకు చెందిన స్టాక్ లను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తులో లాభాలను ఆర్జించడానికి ఈ పరిశీలన చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఐపీవోకు వస్తున్న కంపెనీలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. దక్షిణ కొరియాకు చెందిన కార్ల దిగ్గజం హ్యుందాయ్ కంపెనీ త్వరలో ఐపీవోకు రానుంది. దీనికి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దేశంలో అతిపెద్ద ఐపీవో

హ్యుందాయ్ కంపెనీ ఐపీవో కు రావడంతో కొత్త చరిత్రకు నాంది పడనుంది. దీని ద్వారా రూ.25 వేల కోట్లను సమీకరించుకునేందుకు ఆ కంపెనీ రంగం సిద్ధం చేసుకుంది. దేశంలో అతి పెద్ద ఐపీవో గా ఇది మారనుంది దీని కోసం ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో కొంత వాటాను అంటే దాదాపు 14.22 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఈ ఇష్యూ పూర్తయితే ఎల్ ఐసీ రికార్డు చెరిగిపోతుంది. 2022లో ఎల్ ఐసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21 వేల కోట్లను సమీకరించింది. ఇప్పటి వరకే అదే రికార్డు.

సెబీ నుంచి అనుమతి

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంచ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి హ్యుందాయ్ అనుమతి పొందింది. ఇది దేశంలోని వాహన పరిశ్రమలో కొత్త అధ్యాయం లిఖిస్తుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ లిస్టింగ్ అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు హ్యుందాయ్ రానుంది. దేశంలో అమ్మకాలపరంగా హ్యుందాయ్ రెండో స్థానంలో ఉంది. దీని మార్కెట్ విలువ 18 నుంచి 20 మిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా. హ్యుందాయ్ కంపెనీ అక్టోబర్ లో ఐపీవోకు వస్తుందని సమాచారం. 1996లో మన దేశంలోని ఈ కంపెనీ ప్రవేశించింది. ప్రస్తుతం వివిధ కార్ల విభాగాలలో 13 రకాల మోడళ్లను విక్రయిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఐపీవో అంటే..

షేర్ల మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారికి ఐపీవో అంటే సుపరిచితమే. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ కు చిన్న రూపమే ఐపీవో. ఒక కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించడానికి, పెట్టుబడులను సమకూర్చుకోవడానికి, మరింత ఉత్పత్తిని పెంచుకునేందుకు ఐపీఓకు వస్తుంది. దీని ద్వారా తన వాటాలను బయటకు విక్రయిస్తుంది. ఆసక్తి కలవారు వాటిని కొనుగోలు చేస్తారు. తద్వారా పెట్టుబడిని సమకూర్చుకుంటుంది. కానీ ప్రతి కంపెనీ ఇష్టం వచ్చినట్టు ఐపీవోకు రాకూడదు. దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రధానంగా సెబీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఐపీవో ద్వారా వచ్చిన మూలధనాన్ని దేనికి వినియోగిస్తారో కూడా వివరణ ఇవ్వాలి.

సర్వత్రా ఆసక్తి

దేశం మార్కెట్ లో ప్రముఖ స్థానం సంపాదించుకున్న హ్యుందాయ్ ఐపీవోకు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కంపెనీకి కార్లకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఐపీవోలో హ్యుందాయ్ కంపెనీ వాటాలను దక్కించుకునేందుకు అంతర్జాతీయంగా అనేక సంస్థలు పొటీ పడనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..