AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hall Marked Gold: త్వరలో ఆ బంగారానికి కూడా హాల్ మార్క్.. అదే కారణమంటున్న నిపుణులు

భారతదేశంలో అధిక శాతం బంగారం కేవలం ఆభరణాల రూపంలో మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటారు. పెరిగిన ధరల నేపథ్యంలో తక్కువ క్యారెట్ బంగారానికి డిమాండ్ అమాంతం పెరిగింది. అందువల్ల ఇకపై 9 క్యారెట్ల బంగారానికి హాల్‌మార్కింగ్‌తో పాటు యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) నంబర్లను ప్రవేశ పెట్టాలని బంగారు వ్యాపారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కోరుతోంది. బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Hall Marked Gold: త్వరలో ఆ బంగారానికి కూడా హాల్ మార్క్.. అదే కారణమంటున్న నిపుణులు
Gold Price
Nikhil
|

Updated on: May 24, 2024 | 4:30 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో బంగారం కొనుగోలుదారులు విపరీతంగా కొనుగోలు చేస్తున్నాయి. అయితే భారతదేశంలో అధిక శాతం బంగారం కేవలం ఆభరణాల రూపంలో మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటారు. పెరిగిన ధరల నేపథ్యంలో తక్కువ క్యారెట్ బంగారానికి డిమాండ్ అమాంతం పెరిగింది. అందువల్ల ఇకపై 9 క్యారెట్ల బంగారానికి హాల్‌మార్కింగ్‌తో పాటు యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) నంబర్లను ప్రవేశ పెట్టాలని బంగారు వ్యాపారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కోరుతోంది. బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఐఎస్ తాజా డిమాండ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుంది. 

ప్రస్తుతం భారతదేశంలో 14, 18, 22 క్యారెట్ల బంగారం మాత్రమే హెచ్‌యూఐడీ నంబర్‌తో హాల్‌మార్క్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం  డిమాండ్ చేస్తున్న 9 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.27,740గా ఉంది.  అయితే 9 క్యారెట్స్ గోల్డ్‌కు కేవలం 3 శాతం అదనపు వస్తువులు, సేవల పన్ను విధిస్తారు. 9 క్యారెట్ బంగారానికి హాల్మార్కింగ్ అనుమతిస్తే వినియోగదారులు తమ బడ్జెట్లో భారీ నగలను కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా బంగారు అమ్మకాలు పెరుతాయని పేర్కొంది. గడిచిన ఐదు నెలల్లో బంగారం ధరలు దాదాపు 17 శాతం పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలు, బంగారానికి చైనా డిమాండ్ పెరగడంతో ఈ పెరుగుదల మార్చి 2024లో ప్రారంభమైంది.

జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ వారి ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరువలో ఉన్నాయి. ఇటీవల 10 గ్రాములు రూ. 73,930 వద్ద ప్రారంభమయ్యాయి. స్వల్పంగా రూ. 91 లేదా 0.12 శాతం తగ్గాయి. అలాగే వెండి కూడా జూలై కాంట్రాక్టులు కిలోకు రూ.419 లేదా 0.44 శాతం తగ్గి రూ. 94,306కు చేరుకుంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీపై ట్రేడర్లు సంకేతాల కోసం ఎదురుచూస్తున్నందున బంగారం ధరలు వరుసగా రెండవ రోజు వారి రికార్డు స్థాయికి దగ్గరగా ఉన్నాయి. కొంతమంది విధాన నిర్ణేతలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం రెండు ఫెడ్ రేట్ల తగ్గింపు సంభావ్యత తగ్గింది. అయినప్పటికీ బంగారం ధరలు ఈ వారం ప్రారంభంలో చేరిన కీలక $2,400 స్థాయి కంటే స్థిరంగా ఉన్నాయి. సురక్షితమైన కొనుగోలుతో పాటు ఈ ఏడాది చివర్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుంచి వడ్డీ రేటు తగ్గింపులకు అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి