Silver Rate Today: షాకిస్తున్న వెండి ధరలు.. దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన సిల్వర్‌ రేట్లు.. ఎంతంటే..?

బులియన్ మార్కెట్లో (Bullion Market) బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తాయి. అందుకే కొనుగులుదారులంతా వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు.

Silver Rate Today: షాకిస్తున్న వెండి ధరలు.. దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన సిల్వర్‌ రేట్లు.. ఎంతంటే..?
Silver Rate Today
Follow us

|

Updated on: Feb 09, 2022 | 5:42 AM

Latest Silver Price: పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్లో (Bullion Market) బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తాయి. అందుకే కొనుగులుదారులంతా వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. ఇటీవల కాలంలో వెండి ధరలు (Silver Price) పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కూడా వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ. 61,900 గా ఉంది. కిలో వెండిపై రూ.300 మేర పెరిగింది. కాగా.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,900 లుగా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,900 లుగా కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 65,100 లుగా ఉంది.

* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 61,900 లుగా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 65,100 గా ఉంది.

* కేరళలో కిలో వెండి ధర రూ.65,100 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,100 గా ఉంది.

* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 65,100 లుగా ఉంది.

* విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 64,900 వద్ద కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో

Jio Calls, Data Free: రిలయన్స్‌ జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజులు ఉచితంగా కాల్స్‌, డేటా

BharatPe: ఫోన్ పే లో వాటాలు అమ్మే ప్రయత్నాల్లో సహవ్యవస్థాపకుడు..