Silver Price Today: బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. రోజురోజుకు సిల్వర్ ధర దూసుకుపోతోంది. ఒక వైపు బంగారం ధర షాకిస్తుంటే.. మరో వైపు వెండి కూడా కొనుగోలు దారులకు షాకిస్తోంది. అయితే గురువారం ధరలతో పోల్చితే కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరుగగా, కొన్ని ప్రాంతాల్లో భారీగా పెరిగింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో కిలో వెండిపై రూ.100 పెరుగగా, హైదరాబాద్, చెన్నై నగరాల్లో రూ.900 వరకు పెరిగింది. ఇక శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, చెన్నైలో రూ.77,500 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, కోల్‌కతాలో రూ.72,000 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, కేరళలో రూ.72,000 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,500 ఉండగా, విజయవాడలో రూ.77,500 ఉంది.