AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Prices Hike: మాంసం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన చికెన్‌ ధర

Chicken Prices Hike: చికెన్‌ ధర మళ్లీ భగ్గుమంటోంది. ఒక వైపు గుడ్డు ధర తగ్గుముఖం పడుతుంటే.. మరో వైపు చికెన్‌ ధరలు మాత్రం అమాంతంగా పెరిగిపోతున్నాయి. ముందే ఇరాన్‌-ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం కారణంగా ఒక్కొక్కటిగా ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్‌ సిలిండర్ల కొరత ఏర్పడుతోంది. ఇప్పుడు చికెన్‌ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి..

Chicken Prices Hike: మాంసం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన చికెన్‌ ధర
Chicken Prices Hike
Subhash Goud
|

Updated on: Mar 23, 2026 | 10:51 AM

Share

Chicken Prices Hike: మాంసం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌. ఎందుకంటే చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తు్న్న చికెన్‌ ధరలు.. తాజాగా భారీ స్థాయిలో ఎగబాకుతోంది. ధరలు కొండెక్కుతున్నాయి. ఆదివారం బహిరంగ మార్కెట్‌లో కిలో చికెన్‌ (స్కిన్‌లెస్‌) ధర రూ.340 వరకు ఉండగా, అదే వారం రోజుల కిందట కిలో చికెన్ ధర రూ.260 వరకు ఉంది. చికెన్‌ ధరలు ఒక్కసారి పెరగడంతో సామాన్యులు కష్టంగా మారిపోయింది. ముందే యుద్దం కారణంగా ఒక్కొక్కటిగా ధరలు పెరిగిపోతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు చికెన్‌ ధరలు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఇదిలా ఉంటే మరోవైపు కోడి గుడ్డు ధర మాత్రం పడిపోతున్నాయి. గతంలో ఒక గుడ్డు ధర రూ.8 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.4..20 పైసల వద్ద కొనసగుతోంది. కోడిగుడ్లు ఎగుమతి ఆగిపోవడంతో ధరలు పడిపోయాయని పౌల్ర్టీ యజమానులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి కోడిగుడ్లు తమిళనాడుకు తీసుకెళ్లి అక్కడి నుంచి గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతాయి. కానీ ప్రస్తుతం యుద్ధం కారణంగా గల్ఫ్‌కు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో గుడ్డు ధర ఆమాంతంగా పడిపోయింది.

ఇది కూడా చదవండి: Gold Price: భారీ పతనం.. రూ.19 వేలు తగ్గిన బంగారం ధర.. వెండి రూ.55 వేలు.. తులం ధర రూ.1 లక్షకు చేరుతుందా?

ఇవి కూడా చదవండి

చికెన్‌ ధరలు పెరగడానికి కారణాలు ఏంటి?

చికెన్‌ ధర పెరగడానికి బ్రాయిలర్‌ కోళ్ల ఉత్పాదకత తగ్గడం, రంజాన్‌, ఇతర ఫంక్షన్ల కారణంగా చికెన్‌ ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు చికెన్‌ దుకాణ వ్యాపారులు. డిమాండ్‌కు సరిపడా చిన్న బ్రాయిలర్‌ కోళ్లు కూడా దొరకడం లేదట. అలాగే పౌల్ట్రీ నిర్వాహకులు పిల్లల పెంపకం ఆపేడయం కూడా మరో కారణం అంటున్నారు. కోళ్లు డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేని కారణంగా చికెన్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయని చెబుతున్నారు.

Lifestyle: రూ.35 వేల కోట్లకుపైగా ఆస్తులు.. భార్యా పిల్లలతో నార్మల్ లైఫ్.. కారణం తెలిస్తే అవాక్కవుతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us