EV Battery: అసలు తప్పంతా మీదే..! ఈవీ స్కూటర్‌లో బ్యాటరీ సమస్యల కారణాలు తెలిస్తే షాక్‌..!

| Edited By: Ravi Kiran

Dec 14, 2023 | 1:40 PM

మన దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఫోర్‌ వీలర్స్‌తో పోల్చుకుంటే టూ వీలర్‌ ఈవీలే ఎక్కువుగా అమ్ముడుపోయాయి. వీటిల్లో కూడా ఈవీ స్కూటర్లే ఎక్కువగా అమ్ముడయ్యాయి. అయినా కూడా భారతదేశంలో ఈవీ స్కూటర్లు పనితీరుపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయ. ముఖ్యంగా బ్యాటరీ పనితీరుపైనే అనుమానంతో చాలా మంది ఈవీలను కొనుగోలు చేయడం లేదు. అయితే నిపుణులు మాత్రం బ్యాటరీలను సరిగ్గా నిర్వహిస్తే ఈవీ వాహనాలకు అడ్డే ఉండదని పేర్కొంటున్నారు.

EV Battery: అసలు తప్పంతా మీదే..! ఈవీ స్కూటర్‌లో బ్యాటరీ సమస్యల కారణాలు తెలిస్తే షాక్‌..!
Ev Scooter Battery
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల జోరు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరల నుంచి రక్షణకు చాలా మంది ఈవీ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడడానికి ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి. దీంతో ఈవీ వాహనాలు కొనుగోళ్లు పెరిగాయి. ముఖ్యంగా భారతదేశం విషయానికి వస్తే అమెరికా, చైనా తర్వాత మన దేశమే ఈవీ వాహనాల్లో అమ్మకాల పరంగా ముందు ఉంది. అయితే మన దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఫోర్‌ వీలర్స్‌తో పోల్చుకుంటే టూ వీలర్‌ ఈవీలే ఎక్కువుగా అమ్ముడుపోయాయి. వీటిల్లో కూడా ఈవీ స్కూటర్లే ఎక్కువగా అమ్ముడయ్యాయి. అయినా కూడా భారతదేశంలో ఈవీ స్కూటర్లు పనితీరుపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయ. ముఖ్యంగా బ్యాటరీ పనితీరుపైనే అనుమానంతో చాలా మంది ఈవీలను కొనుగోలు చేయడం లేదు. అయితే నిపుణులు మాత్రం బ్యాటరీలను సరిగ్గా నిర్వహిస్తే ఈవీ వాహనాలకు అడ్డే ఉండదని పేర్కొంటున్నారు. కాబట్టి ఈవీ వాహనాల బ్యాటరీల్లో వచ్చే సమస్యలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉండే బ్యాటరీలు ఎన్నో ఏళ్లపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసే విధంగా తయారు చేస్తారు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లోని బ్యాటరీలు లిథియం అయాన్‌ను ఉపయోగించి తయారు చేస్తారు. ఇది వాటి జీవితకాలాన్ని పెంచుతుంది. టూ వీలర్లలో బ్యాటరీ లైఫ్ కూడా ఐదేళ్ల కంటే ఎక్కువని నిపుణులు వివరిస్తున్నారు. దేశంలో లభించే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో అనేక రకాల పరీక్షల తర్వాత బ్యాటరీని అమరుస్తారు. దీనితో పాటు బ్యాటరీపై వారెంటీని కూడా కంపెనీలు ఇస్తాయి. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై వారెంటీ ఐదు నుంచి ఏడు సంవత్సరాలు లేదా 60 నుంచి 80 వేల కిలోమీటర్ల వరకు ఇస్తారు.

బ్యాటరీ ఎప్పుడు పాడవుతుంది?

కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత బ్యాటరీని ఛార్జ్ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అయితే వాడే కొద్దీ బ్యాటరీ ఆరోగ్యం క్షీణించడంతోఛార్జింగ్ సమయం పెరగడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా కొత్త బ్యాటరీ ఛార్జ్ చేసిన తర్వాత త్వరగా డ్రెయిన్ అవ్వదు. దీని పరిధి కూడా చాలా ఎక్కువ. కానీ బ్యాటరీ చెడిపోవడం ప్రారంభించినప్పుడు తక్కువ ఉపయోగించినప్పటికీ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. ఇది వాహన మైలేజ్‌ను కూడా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

వాతావరణం

వాతావరణం వల్ల బ్యాటరీ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. దేశంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా, సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సామర్థ్యం ప్రభావితం కావచ్చు.

అజాగ్రత్త 

బ్యాటరీని ఎప్పుడూ ఓవర్‌ఛార్జ్ చేయకూడదు. దాదాపు అన్ని కంపెనీలు వాహనాన్ని ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అనే సమాచారాన్ని అందిస్తాయి. అలాంటి పరిస్థితిలో ఓవర్ ఛార్జింగ్‌ను నివారిస్తే బ్యాటరీ జీవిత కాలం పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..