AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVS I Qube: టీవీఎస్ ఐక్యూబ్ లవర్స్‌కు షాక్.. ఆ నెలలో తయారైన స్కూటర్స్ రీకాల్

పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఈవీ వాహనాల బిల్డ్ క్వాలిటీ తక్కువగా ఉంటుందనే అనుమానం అందరికీ ఉంటుంది. ఈ నేపథ్యంలో సూపర్ ఫీచర్స్‌తో పాటు మంచి బిల్డ్ క్వాలిటీతో ఇటీవల కాలంలో స్టార్టప్ కంపెనీల దగ్గర నుంచి టాప్ కంపెనీల వరకూ సరికొత్త ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ టీవీఎస్ రిలీజ్ చేసిన ఐక్యూబ్ ఈవీ స్కూటర్ అందరినీ ఆకర్షించింది. ఇతర స్కూటర్లతో పోటీపడేలా అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ స్కూటర్ల కొనుగోళ్లు ఆకర్షణీయ స్థాయిలో ఉన్నాయి.

TVS I Qube: టీవీఎస్ ఐక్యూబ్ లవర్స్‌కు షాక్.. ఆ నెలలో తయారైన స్కూటర్స్ రీకాల్
Tvs Iqube Electric Scooter
Nikhil
|

Updated on: Jun 11, 2024 | 2:05 PM

Share

భారతదేశంలో ఈవీ రంగం రోజురోజుకూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈవీ రంగంలో ఈవీ స్కూటర్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ స్కూటర్ల వాడకాన్ని ఇష్టపడుతున్నారు. మొదట్లో కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన వినియోగం క్రమేపి గ్రామీణులు కూడా ఈవీ వాహనాల వాడకాన్ని ఇష్టపడుతున్నారు. అయితే పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఈవీ వాహనాల బిల్డ్ క్వాలిటీ తక్కువగా ఉంటుందనే అనుమానం అందరికీ ఉంటుంది. ఈ నేపథ్యంలో సూపర్ ఫీచర్స్‌తో పాటు మంచి బిల్డ్ క్వాలిటీతో ఇటీవల కాలంలో స్టార్టప్ కంపెనీల దగ్గర నుంచి టాప్ కంపెనీల వరకూ సరికొత్త ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ టీవీఎస్ రిలీజ్ చేసిన ఐక్యూబ్ ఈవీ స్కూటర్ అందరినీ ఆకర్షించింది. ఇతర స్కూటర్లతో పోటీపడేలా అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ స్కూటర్ల కొనుగోళ్లు ఆకర్షణీయ స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ స్కూటర్లను టీవీఎస్ కంపెనీ రీకాల్ చేసిందనే వార్త ఈవీ ప్రియులను ఆందోళనకు గురి చేస్తుంది. కాబట్టి టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ల రీకాల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ప్రోయాక్టివ్ ఇన్‌స్పెక్షన్ కోసం ఎంపిక చేసిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవల తెలిపింది. జులై 10, 2023 నుంచి సెప్టెంబరు 9, 2023 మధ్య తయారు చేసిన యూనిట్ల బ్రిడ్జ్ ట్యూబ్‌ను కంపెనీ తనిఖీ చేస్తుంది. పొడిగించిన వినియోగం కంటే వాహనానికి సంబంధించిన రైడ్ హ్యాండ్లింగ్ బాగా ఉందని నిర్ధారించడానికి రీకాల్ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. కస్టమర్‌కు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభావితమైన స్కూటర్‌లను రిపేర్ చేస్తామని ప్రకటించారు. ఈ కంపెనీ లేదా దాని డీలర్ భాగస్వాములు వ్యక్తిగతంగా కస్టమర్లను సంప్రదిస్తారని టీవీఎస్ మోటార్ తెలిపింది.

టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కేడబ్ల్యూహెచ్ మోడల్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఇది వాల్‌నట్ బ్రౌన్, పెరల్ వైట్ అనే రెండు రంగులలో లభిస్తుంది. ఇది కంపెనీకు సంబంధించిన చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 75 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. అలాగే 3.4కేడబ్ల్యూహెచ్, 5.1 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 1.55 లక్షలు, రూ. 1.83 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి