Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: గుడ్‌న్యూస్‌.. ఈపీఎఫ్‌వో రూల్స్‌ మార్పు.. కేవైసీ ఉంటే చెక్‌ అవసరం లేదు

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిబంధనలలో మార్పులు చేసింది. క్లెయిమ్‌ విషయంలో మార్గాన్ని మరింత సులభతరం చేసింది. క్లెయిమ్‌ విషయంలో చెక్, బ్యాంకు పాస్‌పుస్తకం కాపీ ఇవ్వలేదంటూ క్లెయిమ్‌ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉండేవి. అయితే ఇటువంటి సమస్యకు ఈపీఎఫ్‌వో ఉపశమనం కల్పించింది. ఆధార్‌ కేవైసీ ధృవీకరణ ఉంటే చెక్‌ బుక్‌ అవసరం లేకుండా క్లెయిమ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు..

EPFO: గుడ్‌న్యూస్‌.. ఈపీఎఫ్‌వో రూల్స్‌ మార్పు.. కేవైసీ ఉంటే చెక్‌ అవసరం లేదు
Epfo
Follow us
Subhash Goud

|

Updated on: Jun 11, 2024 | 1:59 PM

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిబంధనలలో మార్పులు చేసింది. క్లెయిమ్‌ విషయంలో మార్గాన్ని మరింత సులభతరం చేసింది. క్లెయిమ్‌ విషయంలో చెక్, బ్యాంకు పాస్‌పుస్తకం కాపీ ఇవ్వలేదంటూ క్లెయిమ్‌ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉండేవి. అయితే ఇటువంటి సమస్యకు ఈపీఎఫ్‌వో ఉపశమనం కల్పించింది. ఆధార్‌ కేవైసీ ధృవీకరణ ఉంటే చెక్‌ బుక్‌ అవసరం లేకుండా క్లెయిమ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. అయితే చందాదారుడి బ్యాంకు ఖాతా వివరాల కేవైసీ ఆమోదించినవారికే ఈ సదుపాయం లభిస్తుందని ఈపీఎఫ్‌వో వెల్లడించింది. క్లెయిమ్‌ సమయంలో చందాదారుడి అకౌంట్‌ వివరాలను బ్యాంకు, ఎన్‌పీసీఐ ఆధార్‌ కేవైసీ ద్వారా ధ్రువీకరణ పూర్తయిన క్లెయిమ్‌లకు చెక్, బ్యాంకు పాస్‌బుక్‌ అందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సమాచారం ఆధారంగా ఉద్యోగులు క్లెయిమ్‌ దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది.

సీడెడ్ ఆధార్ నంబర్ ధృవీకరణ: యూఐడీఏఐ మీ బ్యాంక్‌తో ఆధార్ నంబర్‌ను ధృవీకరిస్తుంది. ఇది ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. బ్యాంక్ పాస్‌బుక్ లేదా చెక్ బుక్‌ కాపీ లేకుండా ఆన్‌లైన్ క్లెయిమ్ వెరిఫికేషన్ పూర్తి చేస్తుంది. అందుకే తిరస్కరించబడిన క్లెయిమ్‌ల సంఖ్యను తగ్గిస్తుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది.

ధృవీకరించబడిన బ్యాంక్ డేటా: మీ బ్యాంక్ సమాచారం మునుపటి కేవైసీ లేదా మరేదైనా పద్ధతి ద్వారా ధృవీకరించబడి ఉంటే, మీరు ఎటువంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు.

క్లెయిమ్ మొత్తం: ఈ తగ్గింపు నిర్దిష్ట పరిమితి కంటే తక్కువ ఉన్న క్లెయిమ్‌లకు వర్తించవచ్చు. అలాగే ఈపీఎఫ్‌ క్లెయిమ్‌కు అత్యుత్తమ సపోర్టింగ్ పేపర్‌వర్క్ అనేది సభ్యుని పేరు, బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తో కూడిన అసలైన, రద్దు చేయబడిన చెక్కు. ఇది మీ క్లెయిమ్‌ను పరిష్కరించడానికి మీ బ్యాంక్ ఖాతా సమాచారంగా ఉపయోగపడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి