Fixed Deposit: కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వరంగ బ్యాంకులు.. 5 నుంచి 3 ఏళ్లకు తగ్గనుందా?

కస్టమర్ల నుంచి ఎక్కువ డిపాజిట్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు ప్రకటించేందుకు అనుమతించాలని ఎస్‌బీఐ సహా వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బ్యాంకులు కొత్త తరహా చర్యలపై ఆలోచిస్తున్నాయి . ఈ మేరకు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ప్రస్తుతం ఐదేళ్ల వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంది. అయితే..

Fixed Deposit: కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వరంగ బ్యాంకులు.. 5 నుంచి 3 ఏళ్లకు తగ్గనుందా?
Bank
Follow us
Subhash Goud

|

Updated on: Jun 11, 2024 | 1:02 PM

కస్టమర్ల నుంచి ఎక్కువ డిపాజిట్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు ప్రకటించేందుకు అనుమతించాలని ఎస్‌బీఐ సహా వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బ్యాంకులు కొత్త తరహా చర్యలపై ఆలోచిస్తున్నాయి . ఈ మేరకు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ప్రస్తుతం ఐదేళ్ల వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంది. అయితే మూడేళ్లకు తగ్గించేందుకు అనుమతించాలన్నది ఒక సూచన.

2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లోని రుణాలతో పోలిస్తే డిపాజిట్లు చాలా తక్కువగా ఉన్నాయి. నిధుల సమీకరణ కోసం బ్యాంకులు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ (సీడీ) పథకాలను ఆశ్రయిస్తున్నాయి. ఈ రకమైన సీడీ డిపాజిట్లపై బ్యాంకులు అధిక వడ్డీని అందిస్తాయి.

సాధారణంగా ప్రజలు బ్యాంకుల్లో ఎఫ్‌డిలను ఉంచడం కంటే షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లు, ఇఎల్‌ఎస్‌ఎస్ ఫండ్‌లు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లు అయినప్పటికీ, ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నట్లు బ్యాంకులు గుర్తించాయి.

ఈ నేపథ్యంలో బ్యాంకుల సంప్రదాయ ఫిక్సడ్‌ డిపాజిట్లలో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఇన్వెస్టర్లను ఆకర్షించాలన్నది బ్యాంకుల వాదన. పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో లాక్-ఇన్ వ్యవధిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించడం ప్రయోజనకరంగా ఉంటుందని బ్యాంకులు భావిస్తున్నాయి. 2023-24 సంవత్సరంలో బ్యాంకుల్లో ఇచ్చిన రుణం మొత్తం 16.3 శాతం పెరిగింది. డిపాజిట్ల మొత్తంలో పెరుగుదల 12.9 శాతం మాత్రమే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!