PM Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? కారణమిదే.. ఇలా ఫిర్యాదు చేయండి..
రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్ యోజన) ఓ వరం అని చెప్పాలి. మిలియన్ల రైతులకు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రైతులకు అందిస్తోంది. దీనికి సంబంధించిన 17వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలైంది.
రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్ యోజన) ఓ వరం అని చెప్పాలి. మిలియన్ల రైతులకు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రైతులకు అందిస్తోంది. దీనికి సంబంధించిన 17వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలైంది. కాగా ఫిబ్రవరి 28న ఇంతకుముందు ఇన్‌స్టాల్‌మెంట్ అంటే 16వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలైంది. ఇప్పుడు 17వ ఇన్‌స్టాల్‌మెంట్ కు సంబంధించిన ఫైల్ పైనే మూడో సారి ప్రధానమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ సంతకం చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సమయం ప్రారంభం కావడంతో రైతుల పెట్టుబడికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే మీకు గతంలో ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నా ఒక పని చేయకపోతే మీకు ఈ సారి నగదు జమ అవ్వదు. అదే ఈ-కేవైసీ. ఈ-కేవైసీ చేయించారో లేదో సరిచూసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
తొలి సంతకం..
పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 17వ ఇన్‌స్టాల్‌మెంట్ ఏటా జూన్లో విడుదలవుతుంది. ఈ ఏడాది కూడా ఈ నెలాఖరులోపు విడుదలయ్యే అవకాశం ఉందని ముందు చెప్పారు. అయితే పీఎం నరేంద్ర మోదీ తాను మూడో సారి పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తొలి సంతకాన్ని రైతులకు సంబంధించిన దాని చేశారు. దీంతో రూ. 2000 నగదు రైతులకు బదిలీ అయ్యింది.
ఈ-కేవైసీ తప్పనిసరి..
ఈ పథకానికి అర్హులైన రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీని చేయించుకోవాలి. లేదంటే దీనికి సంబంధించిన నిధులు పడకపోవచ్చు. అందుకే వీలైనంత త్వరగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తయితే ఓకే కానీ.. లేకపోతే మాత్రం వెంటే చేయించాలి.
ఈ-కేవైసీ ఎలా చేయాలి?
- పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
- ఈ-కేవైసీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ మీ 12 అంకెలున్న ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
- సెర్చ్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ కొట్టాలి. అంతే మీ ఈ-కేవైసీ విజయవంతంగా పూర్తవుతుంది.
మీ సమాచారం తప్పుగా ఉంటే..
ఒకవేళ మీరు ఇచ్చిన సమాచారం కాకుండా అందులో ఏమైనా తప్పులుంటే వాటిని వెంటనే సరిచేసుకోవాలి. లేకుంటే మీ ఖాతాలో నగదు జమ ఆగిపోతుంది. అందుకే అలాంటి సమస్యలు రాకుండా సమస్యలను pmkisan-ict@gov.in కి ఈ-మెయిల్ చేయొచ్చు. లేదా పీఎం కిసాన్ యోజన నంబర్స్ 155261, 1800115526(టోల్ ఫ్రీ), లేదా 011-23381092కు కాల్ చేయొచ్చు.
పీఎం కిసాన్ యోజన అంటే..
కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అందిస్తోంది. అందులో ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. దీని ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను అందిస్తోంది. పెట్టుబడి సాయం అందిస్తుంది. ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు ప్రతి ఏడాది రూ. 6000 అందిస్తుంది. అయితే దీనిని ఒకేసారి కాకుండా మూడు సమాన ఇన్‌స్టాల్‌మెంట్లలో అందిస్తుంది. అంటే ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్లో రూ. 2000 చొప్పున రైతులకు అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..