AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda H’ness CB350: హోండా సీబీ 350 బైక్‌ వినియోగదారులకు షాక్‌.. ఆ సమస్యతో బైక్‌లన్నీ రీకాల్‌..!

హోండా హెచ్‌నెస్‌ సీబీ 350, హోండా హెచ్‌నెస్‌ సీబీ 350 ఆర్‌ఎస్‌ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా స్వచ్ఛందంగా రీకాల్‌ చేసింది. ముఖ్యంగా డిసెంబర్‌  రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న బింగ్‌ వింగ్‌ డీలర్‌షిప్‌లకు తీసుకురావాలని సూచించింది. ముఖ్యంగా ఈ బైక్స్‌ వారెంటీ స్థితితో సంబంధం లేకుండా నాసిరకం విడిభాగాల భర్తీను ఉచితంగా చేస్తుంది.

Honda H’ness CB350: హోండా సీబీ 350 బైక్‌ వినియోగదారులకు షాక్‌.. ఆ సమస్యతో బైక్‌లన్నీ రీకాల్‌..!
Honda Cb350
Nikhil
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 07, 2023 | 11:10 PM

Share

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌కు పోటీగా హోండా ప్రతిష్టాత్మకంగా రిలీజ్‌ చేసిన హోండా హెచ్‌నెస్‌ సీబీ 350 బైక్‌ను కంపెనీ రీకాల్‌ చేసింది. హోండా బైక్‌ లవర్స్‌ అధిక సంఖ్యలోనే ఈ బైక్స్‌ను కొనుగోలు చేశారు. అయితే హోండా హెచ్‌నెస్‌ సీబీ 350, హోండా హెచ్‌నెస్‌ సీబీ 350 ఆర్‌ఎస్‌ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా స్వచ్ఛందంగా రీకాల్‌ చేసింది. ముఖ్యంగా డిసెంబర్‌  రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న బింగ్‌ వింగ్‌ డీలర్‌షిప్‌లకు తీసుకురావాలని సూచించింది. ముఖ్యంగా ఈ బైక్స్‌ వారెంటీ స్థితితో సంబంధం లేకుండా నాసిరకం విడిభాగాల భర్తీను ఉచితంగా చేస్తుంది. హోండా హెచ్‌నెస్‌ సీబీ 350 బైక్‌ రీకాల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

అక్టోబర్‌ 2020 నుంచి జనవరి 2023 మధ్య తయారు చేసిన రియర్‌ సాఫ్ట్‌ లైట్‌ స్విచ్‌లు నాసిరకంగా ఉన్నాయని పలువురు వినియోగదారులు కంప్లెంట్‌ చేస్తున్నారు. రియర్‌ స్టాప్‌ లైట్‌ రబ్బర్‌ కాంపొనెంట్‌ విషయంలో సమస్యల నేపథ్యంలో హోండా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ స్విచ్‌ లోపల నీరు చేరుతుండడంతో సమస్య మరితం పెరుగుతుంది. అందువల్ల లైటింగ్‌ సమస్యను వినియోగదారులు అనుభవిస్తున్నారు. సెన్సార్‌ హౌసింగ్‌ కోసం బ్యాంక్‌ యాంగిల్‌ సెన్సార్‌లో వినియోగదారులు ఓ సమస్యను ఎదుర్కొంటున్నారు. సెన్సార్‌ బాడీలో సీలింగ్‌ గ్యాప్‌ వల్ల సమస్య ఎదురవుతుంది. ఈ గ్యాప్‌ బ్యాంక్‌ యాంగిల్‌ సెన్సార్‌లోకి నీరు ప్రవేశించడానికి కారణం అవుతుంది. అందువల్ల బైక్‌ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ యాక్ససరీస్‌ అక్టోబర్‌ 2020 నుంచి డిసెంబర్‌ 2021 మధ్య ఈ స్పేర్‌ పార్ట్స్‌ను తయారు చేశారు.

హోండా సీబీ 350 ఫీచర్లు ఇవే

హోండా హెచ్‌నెస్‌ సీబీ 350, హోండా హెచ్‌నెస్‌ సీబీ 350 ఆర్‌ఎస్‌ బైక్‌ను హెచ్‌ఎంఎస్‌ఐ తన లైనప్‌కు సరికొత్త జోడింపుగా ఈ బైక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ బైక్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.99 లక్షలు ఉంటుంది. అలాగే సీబీ 350 డీలక్స్‌ బైక్‌ ధర రూ.2.17 వరకూ ఉంటుంది. ఈ బైక్‌ 348.36 సీసీ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఎయిర్‌ కూల్డ్‌ 4-స్ట్రోక్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ద్వారా పని చేస్తుంది. ఈ బైక్‌ 20.78 బీహెచ్‌పీ వద్ద 29.4 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..