Maruti Suzuki Jimny: మారుతీ సుజుకీ జిమ్నీ నుంచి నయా ఎడిషన్ లాంచ్.. స్టన్నింగ్ ఫీచర్స్‌తో థండర్..
ఇటీవల కాలంలో యువతను కూడా ఆకట్టుకునేలా మారుతీ సుజుకీ నయా కార్లను రిలీజ్ చేస్తుంది. ఈ కార్లల్లో జిమ్నీ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ లాంగ్ ట్రిప్స్‌కు వెళ్లాలనుకునే వాళ్లు ఈ కారును అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ జిమ్నీ కార్లను అత్యధిక స్థాయిలో అందుబాటులో ఉంచుతుంది. ఈ నేపథ్యంలో జిమ్నీ కారుకు సరసమైన అప్‌డేట్ వెర్షన్‌గా థండర్‌ను లాంచ్ చేసింది. మారుతీ రిలీజ్ చేసిన జిమ్నీ థండర్ వెర్షన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
భారతదేశంలో మారుతీ సుజుకీ కార్లకు ఉన్న క్రేజ్ వేరు. మధ్యతరగతి వారికి అనువైన కార్లను రిలీజ్ చేస్తూ మారుతీ సుజుకీ కంపెనీ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఇటీవల కాలంలో యువతను కూడా ఆకట్టుకునేలా మారుతీ సుజుకీ నయా కార్లను రిలీజ్ చేస్తుంది. ఈ కార్లల్లో జిమ్నీ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ లాంగ్ ట్రిప్స్‌కు వెళ్లాలనుకునే వాళ్లు ఈ కారును అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ జిమ్నీ కార్లను అత్యధిక స్థాయిలో అందుబాటులో ఉంచుతుంది. ఈ నేపథ్యంలో జిమ్నీ కారుకు సరసమైన అప్‌డేట్ వెర్షన్‌గా థండర్‌ను లాంచ్ చేసింది. మారుతీ రిలీజ్ చేసిన జిమ్నీ థండర్ వెర్షన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
మారుతీ సుజుకీ జిమ్నీ థండర్ వెర్షన్ ధర రూ.10.74 లక్షల నుంచి రూ.14.05 లక్షల వరకూ ఉంటుంది. ఈ కారు ధరను స్టాండర్డ్ జిమ్నీ వెర్షన్‌తో పోలిస్తే రూ.2 లక్షల తక్కువ ధరకు పొందవచ్చు. ఈ ఎస్‌యూవీ ప్రత్యేక ఎడిషన్ జీటా, ఆల్ఫా వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ కారు స్టైలిష్ లుక్‌తో తక్కువ ధరకే అందుబాటులో ఉండడంతో యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పాటు ఈ కారు పవర్ ట్రెయిన్ ప్రకారం ఎలాంటి మార్పులు లేవు.
మారుతీ సుజుకీ థండర్ ఎడిషన్ 1.5 లీటర్, 4 సిలిండర్, కే సిరీస్ ఇంజిన్‌తో అందిస్తుంది. ఈ ఇంజిన్ 103 బీహెచ్‌పీ శక్తిని,134 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి 4-స్పీడ్ టార్క్ కన్వెర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌ను ఉపయోగిస్తుంది. మారుతీ సుజుకీ జిమ్నీ ముఖ్యంగా ఆఫ్‌రోడిండ్ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..