Stock Market: ఈ సంవత్సరం స్టాక్​ మార్కెట్లు అస్థిరంగా ఉంటాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

| Edited By: Ravi Kiran

Feb 21, 2022 | 8:00 AM

కరోనా(corona) మహమ్మారి కాలంలో 2020- 2021 సంవత్సరాలు స్టాక్ మార్కెట్లు(stock market) బాగా రాణించాయి...

Stock Market: ఈ సంవత్సరం స్టాక్​ మార్కెట్లు అస్థిరంగా ఉంటాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
Stock Market
Follow us on

కరోనా(corona) మహమ్మారి కాలంలో 2020- 2021 సంవత్సరాలు స్టాక్ మార్కెట్లు(stock market) బాగా రాణించాయి. చాలా మంది పెట్టుబడిదారులు (investers) ప్రతి స్థాయిలో సంపాదించారు. సరైన స్థాయిలో మార్కెట్‌లోకి ప్రవేశించిన వ్యక్తి మల్టీబ్యాగర్ రాబడిని పొందాడు. గత కొంత కాలంగా మార్కెట్ ఒత్తిడిలో ఉంది. విదేశీ పెట్టుబడిదారులు అక్టోబర్ నుండి నిరంతరంగా తమ మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ఇది కాకుండా, ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ మార్కెట్ ఇప్పటికీ నష్టల్లో ఉన్నాయి .

ప్రస్తుతం మార్కెట్లో చాలా అస్థిరత ఉందని PGIM ఇండియా మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ హెడ్ అనిరుధ్ నహా చెప్పారు. గత సోమవారం, సెన్సెక్స్ ఒక రోజులో 1700 పాయింట్లకు పైగా పడిపోయింది. మరుసటి రోజు చాలా పెరిగింది. మార్కెట్‌లో భారీ అస్థిరత ఉంది.

ప్రపంచ సరఫరా సమస్య, యాక్సెస్ లిక్విడిటీ ఇన్‌ఫ్లోల కారణంగా ప్రపంచంలో ద్రవ్యోల్బణం పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఫెడరల్ రిజర్వ్ రెండు పనులు చేస్తుంది. ప్రభుత్వం నుండి బాండ్ల కొనుగోలును నిలిపివేస్తుంది. అంతే కాకుండా వడ్డీ రేటును కూడా పెంచనుంది. దీంతో లిక్విడిటీకి కళ్లెం వేసే ప్రయత్నం జరగనుంది. ఈ ఏడాది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 6-7 రెట్లు పెంచవచ్చని బ్రోకరేజ్ చెబుతోంది. మార్కెట్‌లో డిమాండ్ ఉంటుంది కానీ రాబడి తగ్గుతుంది. ఈ విధంగా చూస్తే, 2022 సంవత్సరం స్టాక్ మార్కెట్‌కు కష్టతరంగా మారనుంది.

రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం ముగిసేలా కనిపించడం లేదు. ప్రస్తుతం, ముడి చమురు 94 డాలర్ల వద్ద ఉంది. వివిధ బ్రోకరేజీలు 120 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. భారతదేశం అవసరాలలో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. ముడిచమురు ధర కారణంగా దేశానికి కరెంట్ ఖాతా లోటు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ముడి చమురు బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగితే, కరెంట్ ఖాతా లోటు 0.40 శాతం పెరుగుతుంది. ద్రవ్యలోటు పెరిగితే రూపాయి విలువ పతనం అవుతుంది. ఇది ఎగుమతి, దిగుమతిదారులపై ప్రభావం చూపనుంది.

Read Also.. Bank FD: ఆ బ్యాంకు సీనియర్‌ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌.. గోల్డెన్‌ ఇయర్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ గడువు పొడిగింపు