Toothpaste: ఆ వ్యాపార ప్రకటనలపై నిషేధం.. తప్పుదారి పట్టించేలా ఉన్నాయంటూ జరిమానా

|

Mar 23, 2022 | 12:44 PM

Sensodyne Toothpaste: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తమ వస్తువులను ప్రకటన ద్వారా ప్రజలకు దగ్గరకు చేసి.. తమ ప్రొడక్టన్స్ ను వినియోగదారులకు అందిస్తాయి. తద్వారా మార్కెట్ ను..

Toothpaste: ఆ వ్యాపార ప్రకటనలపై నిషేధం.. తప్పుదారి పట్టించేలా ఉన్నాయంటూ జరిమానా
Sensodyne Ad
Follow us on

Sensodyne Toothpaste: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తమ వస్తువులను ప్రకటన ద్వారా ప్రజలకు దగ్గరకు చేసి.. తమ ప్రొడక్టన్స్ ను వినియోగదారులకు అందిస్తాయి. తద్వారా మార్కెట్ ను పెంపొందించుకుంటాయి. అయితే ఒకొక్కసారి తయారీ కంపెనీలు ఇచ్చే ప్రకటనలపై వివాదాలు నెలకొంటునె ఉంటాయి. తాజాగా సెన్సోడైన్ టూత్‌పేస్ట్ (Sensodyne Toothpaste) ప్రకటనలు  వివాదాస్పదంగా మారాయి. “ప్రపంచవ్యాప్తంగా దంతవైద్యులచే సిఫార్సు చేయబడింది” , “ప్రపంచంలోని నంబర్ 1 సెన్సిటివిటీ టూత్‌పేస్ట్” అనే లేబుల్‌లతో మార్కెటింగ్ చేయడం పై అభ్యంతరం తెలిపింది. అంతేకాదు… ఈ పేస్టు ప్రకటనలు వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయంటూ.. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) భారీగా జరిమానా విధించింది.  టీవీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న సెన్సోడైన్ అడ్వర్టైజ్‌మెంట్లపై సుమోటోగా విచారణ జరిపి.. రూ. 10 లక్షలు జరిమానా విధించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

సెన్సోడైన్ ఉత్పత్తులకు భారత వెలుపల ఉన్న దంత వైద్యులు ఆమోదం తెలుపుతున్నట్లు యాడ్స్ లో చూపిస్తున్నారు. అంతేకాదు పళ్ళు సున్నితత్వం, రక్షణ కోసం సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్, సెన్సోడైన్ ఫ్రెష్ జెల్ లాంటి సెన్సోడైన్ ప్రొడక్ట్స్ వాడవచ్చు..  60 సెకన్లలో పని చేస్తుంది” అంటూ చూపిస్తున్న యాడ్స్ ను నిలిపివేయాలని గ్లాక్సోస్మిత్‌క్లైన్‌కు ఫిబ్రవరి 9న CCPA ఆదేశాలు జారీ చేసింది.

 

Also Read:

Viral Video: ప్రయాణికుడిని బస్సులోంచి కిందకు దింపేసి చెప్పుతో కొట్టిన మహిళా కండక్టర్.. వైరల్ వీడియో

Newton Predicts: 2060లో ప్రపంచం అంతం కానుందా..? ప్రళయం ముంచుకొస్తుందా..? లేఖలో స్పష్టం చేసిన న్యూటన్‌..!

US President Biden: భారత్ భయపడుతోందన్న పెద్దన్న..బైడెన్ మాటలపై అమెరికా నష్టనివారణ చర్యలు!