AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. రాణించిన ఐటీ, ఫార్మా స్టాక్స్‌..

స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఎనర్జీ, ఫార్మా, ఐటీ స్టాక్స్‌ రాణించడంతో సూచిలు పెరిగాయి. రిలయన్స్‌ స్టాక్‌లో పెరుగుదల నమోదు అయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 428 పాయింట్లు పెరిగి 55,320 వద్ద స్థిర పడింది...

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. రాణించిన ఐటీ, ఫార్మా స్టాక్స్‌..
Stock Market
Srinivas Chekkilla
|

Updated on: Jun 09, 2022 | 4:16 PM

Share

స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఎనర్జీ, ఫార్మా, ఐటీ స్టాక్స్‌ రాణించడంతో సూచిలు పెరిగాయి. రిలయన్స్‌ స్టాక్‌లో పెరుగుదల నమోదు అయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 428 పాయింట్లు పెరిగి 55,320 వద్ద స్థిర పడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 16, 478 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 0.49 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.21 శాతం పెరిగింది. సబ్‌ ఇండెక్స్‌ల్లో నిఫ్టీ ఆయిల్‌ & గ్యాస్ 1.96, నిఫ్టీ ఫార్మా 1.20, నిఫ్టీ ఐటీ 0.98 శాతం పెరిగాయి. డా. రెడ్డీస్‌ నిఫ్టీ టాప్‌ గెయినర్‌గా ఉంది. ఈ స్టాక్‌ 3 శాతం పెరిగి రూ.4,324 వద్ద స్థిర పడింది. బీఎస్‌ఈ ఇండెక్స్‌లో డా. రెడ్డీస్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, సన్‌ ఫార్మా, కొటక్‌ మహీంద్రా బ్యాంక్, విప్రో, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, ఇండస్‌లాండ్‌ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.

టాటా స్టీల్‌, అల్ట్రా టెక్‌ సిమెంట్, ఎన్టీపీసీ, బజాజ్‌ ఫినాన్స్‌, ఎస్‌బీఐ, ఏసియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్‌ఎం నష్టాల్లో స్థరపడ్డాయి. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు కనిష్ఠానికి చేరుకున్నాయి. ఈ షేరు రూ. 721.95 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $120 కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. గత వారం US గ్యాసోలిన్ నిల్వలు 812,000 బ్యారెల్స్ తగ్గి 218.18 మిలియన్ బ్యారెల్స్‌కు పడిపోయాయి, ధరలు పెరిగినప్పటికీ వేసవిలో ఇంధన డిమాండ్ పునరుద్ధరణను సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి
Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన