Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. పడిపోయిన మెటల్‌ స్టాక్స్‌.. రాణిస్తున్న ఆటో షేర్లు..

సోమవారం భారత స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. వాల్ స్ట్రీట్ శుక్రవారం బేర్ మార్కెట్ అంచుకు దూసుకెళ్లిన తర్వాత ఆసియాలో మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి...

Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. పడిపోయిన మెటల్‌ స్టాక్స్‌.. రాణిస్తున్న ఆటో షేర్లు..
stock market
Follow us

|

Updated on: May 23, 2022 | 12:52 PM

సోమవారం భారత స్టాక్‌ మార్కెట్లు(Stock Market) లాభాల్లో ప్రారంభమయ్యాయి. వాల్ స్ట్రీట్ శుక్రవారం బేర్ మార్కెట్ అంచుకు దూసుకెళ్లిన తర్వాత ఆసియాలో మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఈ రోజు ఉదయం 9:28 గంటలకు 30-షేర్ బిఎస్‌ఈ(BSE) సెన్సెక్స్ 101 పాయింట్లు 54,428 వద్ద కొనసాగుతుండగా, విస్తృత ఎన్‌ఎస్‌ఈ(NSE) నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 16,284 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 0.76 శాతం, స్మాల్ క్యాప్ 0.22 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. సబ్-ఇండెక్స్‌లు నిఫ్టీ ఆటో 2.64, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.10 శాతం పెరిగాయి.

M&M, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, NTPC కూడా లాభాల్లో కొనసాగుతుండగా..టాటా స్టీల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్ 1,534 పాయింట్లు పెరిగి 54,326 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ(NSE) నిఫ్టీ 456 పాయింట్లు పెరిగి 16,266 వద్ద స్థిరపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..