hzl privatization: మరిన్ని సంస్థలను ప్రైవేటీకరించే దిశగా కేంద్రం అడుగులు.. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌లో వాటాల విక్రయానికి చర్చలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (HZL), ITC లలో తన వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పవన్ హన్స్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI), IDBI బ్యాంక్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ప్రైవేటీకరించాలని చూస్తోంది...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (HZL), ITC లలో తన వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పవన్ హన్స్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI), IDBI బ్యాంక్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ప్రైవేటీకరించాలని చూస్తోంది. కేంద్రం HZLలో 29.54% వాటాను కలిగి ఉంది. దీని విలువ దాదాపు రూ. 37,000 కోట్లు. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (SUUTI) స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ద్వారా ITCలో 7.91% వాటాను కలిగి ఉంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (OFS), ఎంత మేరకు పెట్టుబడుల ఉపసంహరణ వివరాలు ఇంకా రూపొందించలేదు. సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2013 ఆర్థిక సంవత్సరంలో రూ.65,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.
ఎల్‌ఐసీ ఐపీఓ నుంచి 20,560 కోట్లు సమీకరించింది
ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురించిన వార్తల ప్రకారం ఈ నెల ప్రారంభంలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ నుంచి ప్రభుత్వం సుమారు రూ. 20,560 కోట్లను సేకరించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) HZL, ITCలో వాటా విక్రయంపై అంతర్గత చర్చలను ప్రారంభించింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కూడా వీటిలో వాటా విక్రయం ద్వారా రూ.64,000 కోట్లు వస్తాయని భావిస్తున్నారు. ఈ పక్రియను సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా ప్రస్తుతానికి BPCL ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా తక్కువ పెట్టుబడిదారుల ప్రతిస్పందన కారణంగా BPCL వ్యూహాత్మక విక్రయం నిలిపివేశారు.
మరిన్ని బిజినెస్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి…