Budget 2024: రైలు టికెట్ల రాయితీపై సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! నిర్మలమ్మ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి..

దేశంలో లక్షలాది మంది ప్రజలు నిత్యం రైళ్లలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం, చదువు, విహారయాత్రలు ఇలా అందరూ తమ అవసరాలకు అనుగుణంగా ప్రయాణం చేస్తారు. దీంతో రైళ్లు ఎప్పుడు ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. రైల్వేశాఖకు కూడా ఆదాయం భారీ వస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు బడ్జెట్ లో శుభవార్త చెబుతారని ప్రచారం జరుగుతోంది.

Budget 2024: రైలు టికెట్ల రాయితీపై సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! నిర్మలమ్మ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి..
Indian Railway
Follow us

|

Updated on: Jul 16, 2024 | 3:33 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23వ తేదీన పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ కోసం దేశంలోని ప్రజలందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్లో అందజేసే ప్రయోజనాలు, రాయితీలు, సబ్సిడీలపై తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. పన్ను సంబంధించి తగ్గింపుల కోసం పన్ను చెల్లింపుదారులు ఆశలు పెట్టుకున్నారు. అలాగే రైల్వే చార్జీలతో తగ్గింపు కోసం సీనియర్ సిటిజన్లు ఆశగా ఎదురు చూస్తున్నారు.

శుభవార్త చెబుతారా..

దేశంలో లక్షలాది మంది ప్రజలు నిత్యం రైళ్లలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం, చదువు, విహారయాత్రలు ఇలా అందరూ తమ అవసరాలకు అనుగుణంగా ప్రయాణం చేస్తారు. దీంతో రైళ్లు ఎప్పుడు ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. రైల్వేశాఖకు కూడా ఆదాయం భారీ వస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు బడ్జెట్ లో శుభవార్త చెబుతారని ప్రచారం జరుగుతోంది.

రైలు టిక్కెట్లపై రాయితీ..

రైళ్లలో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు గతంలో అనేక ప్రయోజనాలు ఉండేవి. చార్జీలపై రాయితీని అందించేవారు. మహిళా సీనియర్ సిటిజన్లకు 50 శాతం, అలాగే సీనియర్ సిటిజెన్ల అయిన పురుషులు, ట్రాన్స్ జెండర్లకు 40 శాతం రాయితీ ఉండేది. దీనివల్ల వారికి టికెట్ చార్జీలలో భారీ తగ్గింపు లభించేది. అయితే 2020 మార్చిలో ఈ రాయితీలను రద్దు చేశారు. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ లో రైల్వే రాయితీలను పునరుద్ధరిస్తారని సీనియర్ సిటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రద్దుతో రైల్వేశాఖకు ప్రయోజనం..

సీనియర్ సిటిజన్ల టిక్కెట్ రాయితీలను రద్దు చేయడం వల్ల రైల్వేకి అదనపు ఆదాయం సమకూర్చింది. నిబంధనల ప్రకారం.. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పురుషులు, ట్రాన్స్‌జెండర్లు అలాగే 58 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న స్త్రీలను సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. దురంతో, శతాబ్ది, జన శతాబ్ది, రాజధాని రైళ్లు వంటి అన్ని రకాల మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వీరికి రాయితీ అందుబాటులో ఉండేది. దీనిని ఉపసంహరించుకోవడం ద్వారా రైల్వే అదనపు ఆదాయం పొందింది.

పెరిగిన ఆదాయం..

2020 మార్చి తర్వాత భారతీయ రైల్వే ఎనిమిది కోట్ల మంది సీనియర్ సిటిజన్ల నుంచి టిక్కెట్ల రూపంలో రూ. 5,062 కోట్ల ఆదాయం ఆర్జించింది. దానిలో రూ. 2,242 కోట్లు రాయితీలు లేకపోవడం వల్ల వచ్చాయి. ప్రయాణం చేసిన వారిలో 4.6 కోట్ల మంది పురుషులు, 3.3 కోట్ల మంది మహిళా ప్రయాణికులు, 18 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

స్పష్టత లేదు..

రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2022లో పార్లమెంట్‌లో మాట్లాడుతూ సీనియర్ సిటిజన్‌లకు రైల్వే రాయితీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అయితే దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని 2019-20లో ప్రయాణీకుల టిక్కెట్‌లపై రూ. 59,837 కోట్ల గణనీయమైన సబ్సిడీని అందించిందని, ఇది ప్రతి రైలు ప్రయాణీకుడికి సగటున 53 శాతం రాయితీ ఇచ్చినట్టు అయ్యిందని చెప్పకొచ్చారు. అయితే సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్ల రాయితీని పునరుద్ధరిస్తారా, లేదా అనే విషయంపై బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత స్పష్టత లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైలు టికెట్ల రాయితీపై సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్!
రైలు టికెట్ల రాయితీపై సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్!
జోరుగా టాలీవుడ్ లో షూటింగ్ లు.. ఎవరు ఎక్కడన్నారంటే.?
జోరుగా టాలీవుడ్ లో షూటింగ్ లు.. ఎవరు ఎక్కడన్నారంటే.?
మరిన్ని గంటల్లో పెళ్లి..ఇంతలోనే కనిపించకుండా పోయిన వరుడు..పొదల్లో
మరిన్ని గంటల్లో పెళ్లి..ఇంతలోనే కనిపించకుండా పోయిన వరుడు..పొదల్లో
సింహ రాశిలోకి బుధుడు.. వారికి కొత్త ప్రయత్నాల్లో సక్సస్ పక్కా..
సింహ రాశిలోకి బుధుడు.. వారికి కొత్త ప్రయత్నాల్లో సక్సస్ పక్కా..
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు స్పీకర్ తెచ్చుకోవద్దు: కేటీఆర్
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు స్పీకర్ తెచ్చుకోవద్దు: కేటీఆర్
గోవా నుంచి లిక్కర్ బాటిళ్లు తెచ్చాడు.. ఇన్‌స్టా రీల్‌లో హీరోలా..
గోవా నుంచి లిక్కర్ బాటిళ్లు తెచ్చాడు.. ఇన్‌స్టా రీల్‌లో హీరోలా..
వర్షాకాలంలో తలుపుల నుంచి వచ్చే చప్పుడును ఈ చిట్కాలతో తగ్గించండి..
వర్షాకాలంలో తలుపుల నుంచి వచ్చే చప్పుడును ఈ చిట్కాలతో తగ్గించండి..
తీసుకున్న విశ్రాంతి చాలు.. సీనియర్లకు షాకిచ్చిన గంభీర్
తీసుకున్న విశ్రాంతి చాలు.. సీనియర్లకు షాకిచ్చిన గంభీర్
ఇత్తడి పాత్రలో టీ పెట్టి తాగితే.. ఇన్ని ప్రయోజనాలా..
ఇత్తడి పాత్రలో టీ పెట్టి తాగితే.. ఇన్ని ప్రయోజనాలా..
BH సిరిస్‌ కలిగిన నంబర్‌ ప్లేట్‌ ఎవరికి కేటాయిస్తారు?
BH సిరిస్‌ కలిగిన నంబర్‌ ప్లేట్‌ ఎవరికి కేటాయిస్తారు?