AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Self-Employment Scheme: సొంత వ్యాపారం చేయాలనుకుంటున్నారా.? కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ ఫ్రాంచైజ్‌తో లాభాలే లాభాలు..

మనలో కొందరు ఉద్యోగాలకు మొగ్గు చూపితే మరికొందరు మాత్రం వ్యాపారాలు చేయాలనే ఆలోచనలతో ఉంటారు. అప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా వాటి నుంచి బయటకు వచ్చి వ్యాపారాల్లో విజయాలను అందుకున్న ఉదాహరణలు ఉన్నాయి. అయితే సరైన అవగాహన లేక కొందరు, వ్యాపారం ఎంపికలో..

Self-Employment Scheme: సొంత వ్యాపారం చేయాలనుకుంటున్నారా.? కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ ఫ్రాంచైజ్‌తో లాభాలే లాభాలు..
Self Eemployment
Narender Vaitla
|

Updated on: Jan 05, 2023 | 6:14 PM

Share

మనలో కొందరు ఉద్యోగాలకు మొగ్గు చూపితే మరికొందరు మాత్రం వ్యాపారాలు చేయాలనే ఆలోచనలతో ఉంటారు. అప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా వాటి నుంచి బయటకు వచ్చి వ్యాపారాల్లో విజయాలను అందుకున్న ఉదాహరణలు ఉన్నాయి. అయితే సరైన అవగాహన లేక కొందరు, వ్యాపారం ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోక మరికొందరు నష్టాలు చవి చూస్తుంటారు. అయితే లాభనష్టాలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ముమ్మాటికీ వ్యాపారంలో విజయాలను అందుకోవచ్చు. తక్కువ రిస్క్‌, తక్కువ పెట్టుబడితో అందుబాటులో ఉన్న బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా మీకోసం..

1988లో భారత ప్రభుత్వం సఫాల్‌ అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని లాంచ్‌ చేసింది. పట్టణ ప్రాంతాలకు చెందిన కస్టమర్లతో పాటు పండ్లు, కూరగాయల పెంపకందారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్‌ చేశారు. ఈ సఫాల్‌ ప్రోగ్రామ్‌లో ఓ భాగమే మదర్‌ డెయిరీ. దేశవ్యాప్తంగా సుమారు 350కిపైగా మదర్‌ డెయిరీ అవుట్‌లెట్స్‌ ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ ద్వారా ప్రతీనెల స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. ఒక లీటర్‌ పాలపై 30 నుంచి 35 పైసలు కమిషన్‌ పొందొచ్చు. అలాగే ఇతర డెయిరీ ప్రొడక్ట్స్‌పై 5 శాతం, పండ్లు, కూరగాయలపై 9 శాతం లాభాన్ని ఆర్జించవచ్చు.

ఈ ఫ్రాంజైస్‌ను తీసుకోవాలనుకునే వారు సమీపంలో ఉన్న ఆర్మీ వెల్ఫేర్‌ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో అప్లికేషన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం సఫాల్‌, ఆర్మీ వెల్ఫేర్‌లు సంయుక్తంగా ఓ ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. ఆ తర్వాత సంబంధింత ఫ్రాంజైక్‌కు అయ్యే ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్‌ను తీసుకోవాలంటే రూ. 1 లక్ష రిఫండబుల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక మరో లక్ష రూపాయలు వర్కింగ్‌ క్యాపిటల్‌గా చెల్లించాలి. డెయిరీలో లభించే వస్తువులను ఫ్రాంచైజీ నిర్వాహకులే అందిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..