AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NSC Interest Rate: ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేట్లను పెంచిన కేంద్రం.. ఎంతంటే..

భారత ప్రభుత్వం నేషనల్ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఎస్‌సీ) పేరుతో పొదుపు పథకాన్ని అందిస్తోన్న విషయం తెలిసిందే. తక్కువ రిస్క్‌తో రిటర్న్స్‌ పొందే అవకాశం ఉన్న ఈ పొదుపు పథకాన్ని ఉద్యోగులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో ఉన్న వారికి...

NSC Interest Rate: ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేట్లను పెంచిన కేంద్రం.. ఎంతంటే..
Nsc
Narender Vaitla
|

Updated on: Jan 05, 2023 | 5:34 PM

Share

భారత ప్రభుత్వం నేషనల్ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఎస్‌సీ) పేరుతో పొదుపు పథకాన్ని అందిస్తోన్న విషయం తెలిసిందే. తక్కువ రిస్క్‌తో రిటర్న్స్‌ పొందే అవకాశం ఉన్న ఈ పొదుపు పథకాన్ని ఉద్యోగులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో ఉన్న వారికి, కొత్తగా తీసుకోవాలనుకుంటున్న వారికి శుభవార్త తెలిపింది. జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి గాను వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి 6.8 శాతం వడ్డీగా చెల్లిస్తున్నారు. అయితే జనవరి నుంచి ఈ వడ్డీ రేటును 7 శాతానికి పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.

రిస్క్‌ తక్కువగా ఉండే ఈ పొదుపు పథకాన్ని ఇండియన్‌ పోస్టాఫీస్‌ అందిస్తోంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి వార్షీకంగా 7 శాతం వడ్డీని అందిస్తారు. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఎలాంటి పరిమితి ఉండదు. అయితే రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టిన వారికి మాత్రమే బెనిఫిట్స్‌ ఉంటాయి. మెచురిటీ పీరియడ్ 5 ఏళ్లుగా ఉంటుంది. ఈ పథకంలో భారతీయులు ఎవరైనా చేరొచ్చు. స్థానికంగా ఉండే పోస్టాఫీస్‌ను సందర్శించడం ద్వారా ఈ పథకంలో చేరొచ్చు.

ఆన్‌లైన్‌లో ఎన్‌ఎస్‌సీని ఎలా ఓపెన్‌ చేయొచ్చంటే..

* ఇందుకోసం ముందుగా ఇండియన్‌ పోస్టల్‌ ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం ఎన్‌ఎస్‌సీ అకౌంట్‌లోకి వెళ్లి ఓపెన్‌ ఎన్‌ఎస్‌సీ అకౌంట్‌ అండ్‌ కేవీపీ అకౌంట్‌ ఓపెన్‌పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత అకౌంట్ ఓపెనింగ్ కోసం కనీసం రూ. 1000ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

* అనంతరం పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ అకౌంట్‌కు లింక్‌ అయిన డెబిట్‌ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

* చివరిగా టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌పై క్లిక్‌ చేసి సబ్‌మిట్ ఆన్‌లైన్‌ అని క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి