SBI Zero Balance: ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతా వడ్డీ రేట్లు.. ఉచిత లావాదేవీలు, ఇతర పూర్తి వివరాలు

SBI Zero Balance Savings Account: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ (బీఎస్‌బీడీ) ఖాతాను జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతా అని పిలుస్తారు. ఇది ఒక పొదుపు...

SBI Zero Balance: ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతా వడ్డీ రేట్లు.. ఉచిత లావాదేవీలు, ఇతర పూర్తి వివరాలు
Sbi Zero Balance Savings Account
Follow us
Subhash Goud

|

Updated on: Apr 20, 2021 | 3:36 PM

SBI Zero Balance Savings Account: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ (బీఎస్‌బీడీ) ఖాతాను జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతా అని పిలుస్తారు. ఇది ఒక పొదుపు ఖాతా. కొన్ని కనీస సౌకర్యాలను ఉచితంగా వినియోగదారులకు అందిస్తోంది. అయితే నాలుగు ఉచిత లావాదేవీలకు మించి బీఎస్‌బీడీ ఖాతాల్లో ని డిజిటల్‌ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను ఎస్‌బీఐ స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఆగస్టు 2012లో 4 ఉచిత లావాదేవీలకు మించి బీఎస్‌బీడీ ఖాతాలలో సహేతుకమైన ఛార్జీలు వసూలు చేయడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఎస్‌బీఐ బీఎస్‌బీడీ ఖాతాలలో నాలుగు ఉచిత లావాదేవీలకు మించి డెబిట్‌ లావాదేవీల కోసం ఛార్జీలను ప్రవేశపెట్టింది. ఇది జూన్‌ 5, 2016 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. అయితే 2020 ఆగస్టులో చేసిన డిజిటల్‌ లావాదేవీలపై జనవరి 2020 తర్వాత నుంచి వసూలు చేసిన ఛార్జీలను తిరిగి చెల్లించాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ బ్యాంకులకు సూచించింది. జనవరి 2020 నుంచి సెప్టెంబర్‌ 2020 వరకు వసూలు చేసిన ఛార్జీలను బీఎస్‌బీడీ వినియోగదారులకు ఎస్‌బీఐ తిరిగి చెల్లించింది.

ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతా:

ఖాతా తెరిచే సమయంలో కూడా కనీస బ్యాలెన్స్‌ అవసరం లేదు. కస్టమర్లకు ఎటువంటి రుసుము లేకుండా ఏటీఎం కమ్‌ డేబిట్‌ కార్డు అందిస్తుంది. డిపాజిట్‌, ఉపసంహరణ సేవలు ఉచితం. అలాగే పని చేయని ఖాతాలకు, తిరిగి యాక్టివ్‌ చేసేందుకు కూడా ఛార్జీలు విధించదు.

ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతా నగదు, ఏటీఎం ఉపసంహరణలు:

ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతా ఒక నెలలో గరిష్టంగా నాలుగు నగదు ఉపసంహరణలను ఉచితంగా అనుమతిస్తుంది. ఎస్‌బీఐ, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో కూడా ఈ లావాదేవీలు ఉచితం.

ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతా వడ్డీ రేట్లు:

సాధారణ పొదుపు బ్యాంకు ఖాతాల మాదిరిగానే జీరో బ్యాలెన్స్‌ ఖాతాలపై ఎస్‌బీఐ వడ్డీ రేటును అందిస్తుంది. రూ.1 లక్ష వరకు డిపాజిట్లపై బ్యాంకు సంవత్సరానికి 2.70 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతా నుంచి నెలలో గరిష్టంగా 4 నగదు ఉపసంహరణలను ఉచితంగా అనుమతిస్తుంది.

ఇవీ చదవండి: SBI Customers: ఎస్‌బీఐ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్‌.. రూ. 10వేలకు రూ.520 ఈఎంఐ.. ప్రాసెసింగ్‌ ఫీజు ఫ్రీ…

RBI Auction: ఆర్బీఐ కీలక నిర్ణయం… రూ. 14వేల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీ వేలం రద్దు… అధిక ధరలకు అమ్మాలని ట్రేడర్ల డిమాండ్‌

SBI Insurance: కస్టమర్లకు శుభవార్త.. ఎస్‌బీఐ లైఫ్‌ సంపూర్ణ్‌ సురక్ష పాలసీ.. రూ.40 లక్షల లైఫ్‌ కవరేజీతో ఇన్సూరెన్స్‌

Provident Fund: మీరు ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత ఈ పని చేయండి… లేకపోతే మీ పీఎఫ్‌ డబ్బులకు ఇబ్బందులు

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.