SBI Utsav Deposit: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో వివిధ రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్‌బీఐ కస్టమర్ల కోసం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. అదే ‘ఉత్సవ్ డిపాజిట్’ స్కీమ్. ఇందులో సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లకంటే ఎక్కువగా 6.10 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఈ ఉత్సవ్ డిపాజిట్ గడువు అక్టోబర్ 28తో ముగియనుంది. ఇందులో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఇది మంచి ఆప్షన్.
ఈ ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్‌లో 1000 రోజుల ఎఫ్‌డీ ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో ఏడాదికి గరిష్టంగ 6.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇక సీనియర్ సిటిజన్స్ కోసం అదనంగా 0.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ పథకంలో రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఎస్‌ఈఐ ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.90 శాతం నుంచి 5.10 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే 3.40 శాతం నుంచి 6.30 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల్లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.50 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 6.30 శాతం వడ్డీ రేటును అందిస్తోంది బ్యాంకు.
ఎస్‌బీఐ ఎఫ్‌డీపై వడ్డీ రేట్లు:
☛ 7 నుంచి 45 రోజులకు సాధారణ కస్టమర్లకు 2.90 శాతం సీనియర్ సిటిజన్లకు 3.40 శాతం.
☛ 46 నుంచి 179 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 3.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.40 శాతం
☛ 180 నుంచి 210 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 4.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.90 శాతం.
☛ 211 రోజుల నుంచి ఏడాది వరకు సాధారణ కస్టమర్లకు 4.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.10 శాతం.
☛ ఏడాది నుంచి రెండేళ్ల వరకు సాధారణ కస్టమర్లకు సాధారణ కస్టమర్లకు 5.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.80 శాతం.
☛ రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు సాధారణ కస్టమర్లకు 5.35 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.85 శాతం
☛ మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు సాధారణ కస్టమర్లకు5.45 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.95 శాతం.
☛ ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు సాధారణ కస్టమర్లకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.30.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి