AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI ATM Cash Withdrawal: యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులను విత్‌డ్రా చేయడం ఎలా?

డబ్బులు కావాలంటే ముందుగా ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్) నుంచి విత్‌డ్రా చేస్తుంటాము. ఇందుకు ఏటీఎం కార్డు ఉంటే సరిపోతుంది. డెబిట్ లేదా..

UPI ATM Cash Withdrawal: యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులను విత్‌డ్రా చేయడం ఎలా?
Upi Withdrawal
Subhash Goud
|

Updated on: Nov 22, 2022 | 7:07 AM

Share

డబ్బులు కావాలంటే ముందుగా ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్) నుంచి విత్‌డ్రా చేస్తుంటాము. ఇందుకు ఏటీఎం కార్డు ఉంటే సరిపోతుంది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఏటీఎం నుండి డబ్బు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది. కానీ ఇప్పుడు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) సహా ప్రధాన బ్యాంకులు కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణను అనుమతిస్తున్నాయి. ఏటీఎం నుండి యూపీఐ యాప్ ద్వారా కూడా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ఐసీసీడబ్ల్యూ) అని పిలువబడే కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ ఆప్షన్‌ ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ సదుపాయానికి ఎటువంటి రుసుము లేదు. నగదు కోసం ఏటీఎంకు వెళ్లినప్పుడు కార్డును తీసుకెళ్లడం లేదా ఏటీఎం పిన్ నంబర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ సదుపాయం తప్పు పిన్ నంబర్‌ను నమోదు చేయడం, లావాదేవీ వైఫల్యం, కార్డ్ నష్టం మొదలైన సమస్యల నుండి తప్పించుకోవచ్చు.

గూగుల్‌పే, పోన్‌పేతో సహా చాలా యూపీఐ యాప్‌లలో ఐసీసీడబ్ల్యూ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ సదుపాయాన్ని పొందడానికి మొబైల్, ఏటీఎం మెషీన్, ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండాలి. ఈ పద్ధతిలో గరిష్టంగా రూ. 5,000 వరకు మాత్రమే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవడం ఎలా?

➦ ముందుగా ఏటీఎం సెంటర్‌కు వెళ్లాలి.

➦ ఏటీఎం మెషీన్‌ స్క్రీన్‌పై ఉన్న విత్‌డ్రా ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

➦ తర్వాత కనిపించే యూపీఐ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

➦ మీరు యూపీఐ ఆప్షన్‌ను ఎంచుకోగానే క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది.

➦ మొబైల్‌ఫోన్‌లో యూపీఐ యాప్‌ను ఓపెన్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.

➦ తర్వాత యూపీఐ లావాదేవీ మోడ్‌లోనే విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని (గరిష్టంగా రూ.5వేలు) నమోదు చేయాలి.

➦ తర్వాత యూపీఐ పిన్‌ను నమోదు చేసి కొనసాగించాలి.

➦ ఇలా చేసిన వెంటనే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..