Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతా తెరవడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇకపై అంతా ఆన్‌లైన్‌లోనే..

|

Nov 05, 2022 | 7:57 AM

స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారు రోజురోజుకీ పెరుగుతున్నా ఇప్పటికే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతుండడం, డిపాజిట్‌ రేట్లలో నిరంతర పెరుగుదల కారణంగా..

Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతా తెరవడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇకపై అంతా ఆన్‌లైన్‌లోనే..
Fixed Deposit Account
Follow us on

స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారు రోజురోజుకీ పెరుగుతున్నా ఇప్పటికే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతుండడం, డిపాజిట్‌ రేట్లలో నిరంతర పెరుగుదల కారణంగా పెట్టుబడిదారులు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయడానికి ఆసక్తిచూపిస్తున్నారు. ఇటీవల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అక్టోబర్‌ 22న రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై 80 బేసిస్‌ పాయింట్లు పెంచింది.

ఈ నేపథ్యంలోనే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను మరింత ప్రోత్సహించే క్రమంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ ఎఫ్‌డీ ఖాతాలను మరింత సులువుగా తెరిచేందుకు అవకాశం కల్పించింది. ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో ఖాతాను ఓపెన్‌ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఎఫ్‌డీ అకౌంట్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేయడానికి ఈ కింది స్టెప్స్‌ ఫాలో అయితే సరి..

* ఇందుకోసం ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం హోమ్‌ పేజీలో ఉండే డిపాజిట్‌ స్కీమ్స్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* ఆ తర్వాత టర్మ్‌ డిపాజిట్‌ను సెలక్ట్‌ చేసుకొని, ఈ-ఎఫ్‌డీ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

* అనంతరం మీరు ఓపెన్‌ చేయాలనుకుంటున్న ఎఫ్‌డీ ఖాతా టైప్‌ను ఎంచుకోవాలి. తర్వాత ప్రోసీడ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత ఎఫ్‌డీ అకౌంట్‌లోకి ఏ ఖాతా నుంచి డబ్బులు కట్ కావాలే ఎంచుకోండి.

* అనంతరం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మెచ్చూరిటీ తేదీని సెలక్ట్ చేసుకోవాలి.

* చివరిగా సబ్‌మిట్ బటన్‌ను నొక్కిన వెంటనే మీ ఆన్‌లైన్‌ ఎఫ్‌డీ అకౌంట్‌ ఓపెన్‌ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..