MG motors: అద్దె బ్యాటరీతో డబ్బుల ఆదా..ఎంజీ మోటార్స్ బంపర్ ఆఫర్.. !

|

Sep 25, 2024 | 4:15 PM

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. పెట్రోలు, డిజిల్ వాహనాలకు బదులు ఈవీ లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్ల ఈవీ స్కూటర్లు, కార్లు విడుదల అవుతున్నాయి. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ కార్లను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎంజీ మోటార్ ప్రత్యేక విధానాన్ని రూపొందించింది.

MG motors: అద్దె బ్యాటరీతో డబ్బుల ఆదా..ఎంజీ మోటార్స్ బంపర్ ఆఫర్.. !
Mg Motors Ev
Follow us on

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. పెట్రోలు, డిజిల్ వాహనాలకు బదులు ఈవీ లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్ల ఈవీ స్కూటర్లు, కార్లు విడుదల అవుతున్నాయి. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ కార్లను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎంజీ మోటార్ ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. దీని వల్ల వాహనాల ధరలు గణనీయంగా తగ్గుతాయి. దీనికోసం బీఏఏఎస్ ( బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్) అనే ప్రోగామ్ అమలు చేస్తోంది.

బీఏఏఎస్ స్కీమ్

ఎంజీ మోటార్స్ కు చెందిన జెడ్ ఎస్ ఈవీ, కామెట్ ఈవీ (ఎలక్ట్రిక్ కార్లు)ను కొనుగోలు చేసే వారికి బీఏఏఎస్ పథకం వర్తించనుంది. ఈ స్కీంలో కొనుగోలుదారులు బ్యాటరీ మొత్తం ధరను చెల్లించనవసరం లేదు. కారు కొన్నతర్వాత ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారో నిర్ణయించుకోవాలి. ఆ మేరకు డబ్బులు కడితే బ్యాటరీని చార్జ్ చేసి ఇస్తారు. అది పూర్తయిన తర్వాత డబ్బులు ఇచ్చి రీచార్జి చేసుకోవచ్చు. దీని వల్ల కార్ల ధరలు బాగా తగ్గి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అంటే అద్దెను చెల్లించి బ్యాటరీని వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

తక్కువ ధరకే..

బీఏఏఎస్ పథకం ద్వారా కార్ల ధర బాగా తగ్గుతుంది. ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కార్ అసలు ధర రూ.6.99 లక్షలు.దీనికి బీఏఏఎస్ స్కీం వర్తింప జేయడంతో రూ.4.99 లక్షలకే అందుబాటులోకి వచ్చింది. కారు ధర ఏకంగా రూ.2 లక్షలు తగ్గింది. ఈ కారు కొన్న తర్వాత బ్యాటరీ అద్దెగా కిలోమీటర్ కు రూ.2.5 చొప్పున చెల్లించాలి. దీన్ని ఒక్కసారి పూర్తిగా రీచార్జి చేస్తే దాదాపు 230 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

డబ్బులు ఆదా

ఎంజీ జెడ్ ఎస్ ఈవీ కారు ధర రూ.18.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీనికి కూడా బీఏఏఎస్ స్కీమ్ వర్తింపజేశారు. దీంతో రూ.13.99 లక్షలకు తగ్గిపోయింది. కొనుగోలుదారులకు రూ.5 లక్షలు మిగులుతాయి. ఈ కారు బ్యాటరీకి అద్దెగా కిలోమీటర్ కు రూ.4.5 చెల్లించాలి. ఈ కారును ఒక్కసారి చార్జింగ్ చేస్తే 461 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే ఈ పథకంలో బ్యాటరీ అద్దెతో పాటు చార్జింగ్ ఖర్చు అదనంగా ఉంటుంది. కిలోమీటర్ కు ఒక్క రూపాయి చొప్పున కట్టాలి.

విండ్సర్ ఈవీతో ప్రారంభం

బీఏఏఎస్ ప్రోగ్రామ్ అనేది మొదటి విండ్సర్ ఈవీతో ప్రారంభమైంది. ఈ కారు ధర రూ.9.99 లక్షలు కాగా, బ్యాటరీ అద్దెగా కిలోమీటర్ కు రూ.3.5 నిర్ణయించారు. అయితే సుమారు 1500 కిలోమీటర్లు డ్రైవింగ్ చేసేలా కనీస నెలవారీ బ్యాటరీ అద్దెను కొనుగోలుదారులు చెల్లించాలి. అంటే కనీసం రూ.5,250 ప్రతినెలా కట్టాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..