ATM Transaction: ఇక బాదుడే.. బాదుడు.. బ్యాంకు కస్టమర్లకు షాక్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం

|

Jun 10, 2021 | 8:21 PM

ATM Transaction: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకు వినియోగదారులకు షాకిచ్చింది. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు అధిక ఇంటర్‌ఛేంజ్‌ ఫీజును వసూలు చేయడానికి..

ATM Transaction: ఇక బాదుడే.. బాదుడు.. బ్యాంకు కస్టమర్లకు షాక్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం
ATM Transaction
Follow us on

ATM Transaction: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకు వినియోగదారులకు షాకిచ్చింది. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు అధిక ఇంటర్‌ఛేంజ్‌ ఫీజును వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆర్బీఐ నిర్ణయంతో కస్టమర్లకు షాకిచ్చినట్లయింది. ఆర్బీఐ ఏటీఎం ఇంటర్‌ఛేంజ్‌ చార్జీలను పెంచుకోవచ్చని బ్యాంకులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో బ్యాంకు ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్‌పై రూ.17 వరకు చార్జీ వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఫీజు ఇది వరకు రూ.15గా ఉండేది. అలాగే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఈ చార్జీని రూ.5 నుంచి రూ.6కు పెంచింది. మీ బ్రాంచ్‌ ఏటీఎం కాకుండా మరో బ్యాంకు ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుంటే.. అప్పుడు మీ బ్యాంకు .. ఏటీఎం బ్యాంక్‌కు డబ్బులు చెల్లించాలి. దీన్నే ఇంటర్‌ఛేంజ్ ఫీజు అని అంటారు.

అంతేకాకుండా ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత బ్యాంకు కస్టమర్లు ఏటీఎంల నుంచి లావాదేవిలు నిర్వహిస్తే అప్పుడు బ్యాంకులు గరిష్టంగా ఒక్కో లావాదేవిపై రూ.21 వరకు వసూలు వసూలు చేయవచ్చు. ఈ చార్జీ ప్రస్తుతం 20 రూపాయలుగా ఉంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల ఫీజు పెంపు నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల ఫీజు పెంపు నిర్ణయం ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తుందని ఆర్‌బీఐ వెల్లడించింది.

ఇవీ కూడా చదవండి:

LPG Gas Connection: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌.. ఎలాగంటే..!

Savings Accounts: ఈ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలపై అందిస్తున్న వడ్డీ రేట్లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Amazon Flipkart: పోటాపోటీగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లు.. స్మార్ట్‌ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్‌

LPG Customers: గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. భారీ ఊరట.. కొత్త సర్వీసులు అందుబాటులోకి..!