AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renault Car Offers: ఈ కార్లపై రూ. 50,000వరకూ డిస్కౌంట్.. పరిమిత కాలమే అవకాశం

గత డిసెంబర్ లో ఇయర్ ఎండింగ్ సేల్స్ మిస్ అయ్యామని బాధపడుతున్నారా? దీనిని సద్వినియోగం చేసుకోండి. రెనాల్ట్ లో టాప్ వేరియంట్లైన క్విడ్, ట్రైబర్, కైగర్ కార్లపై పలు డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ జనవరి మాసాంతం వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ ప్రయోజనాలను అందిస్తున్నాయి.

Renault Car Offers: ఈ కార్లపై రూ. 50,000వరకూ డిస్కౌంట్.. పరిమిత కాలమే అవకాశం
Renault Kwid
Madhu
|

Updated on: Jan 13, 2024 | 6:16 PM

Share

కారు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ ఇండియా కొత్త సంవత్సరంలో అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. సాధారణంగా ఆటో మొబైల్ కంపెనీలు సంవత్సరాంతంలో అంటే డిసెంబర్ మాసంలో ఇయర్ ఎండింగ్ సేల్స్ పేరిట ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తాయి. అయితే రెనాల్ట్ మాత్రం కొత్త ఏడాదిలో అదిరే ఆఫర్లతో ముందుకొచ్చింది. ఒకవేళ మీరు గత డిసెంబర్ లో ఇయర్ ఎండింగ్ సేల్స్ మిస్ అయ్యామని బాధపడుతున్నారా? దీనిని సద్వినియోగం చేసుకోండి. రెనాల్ట్ లో టాప్ వేరియంట్లైన క్విడ్, ట్రైబర్, కైగర్ కార్లపై పలు డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ జనవరి మాసాంతం వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ ప్రయోజనాలను అందిస్తున్నాయి.

రెనాల్ట్ క్విడ్..

ఈ కారు ధర రూ. 4.69(ఎక్స్-షోరూమ్) లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీనిపై ఇప్పుడు రూ. 20,000 నగదు తగ్గింపుతో పాటు , రూ. 20,000 ఎక్స్ చేంజ్ బోనస్, మరో రూ. 10,000 లాయల్టీ బెనిఫిట్ అందనుంది. క్విడ్ రెనాల్ట్ 2024 మోడల్ ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. పలు సేఫ్టీ ఫీచర్లను జోడించింది. అలాగే తక్కువ ధరలోనే సరసమైన ఏఎంటీ వేరియంట్ ను పరిచయం చేసింది.

రెనాల్ట్ ట్రైబర్..

ఈ కారు ధర రూ. 5.99(ఎక్స్-షోరూమ్) లక్షలతో ప్రారంభమవుతుంది. దీనిపై కూడా అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 లాయల్టీ బెనిఫిట్‌ అందిస్తోంది. ట్రైబర్ కూడా కొత్త మోడల్ లాంచ్ చేసింది. ఇది బ్లాక్ కలర్ ఆప్షన్తో పాటు అనేక అదనపు ఫీచర్లను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

రెనాల్ట్ కైగర్..

రెనాల్ట్ కైగర్, ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆర్ఎక్స్ జెడ్ వేరియంట్ రూ. 20,000 నగదు తగ్గింపుతో వస్తుంది. అయితే ఆర్ఎక్స్ టీ ఆప్షన్ టర్బో వేరియంట్‌లు రూ. 25,000 నగదు తగ్గింపుతో అందుబాటులో ఉంది. అదనంగా, అన్ని వేరియంట్లలో రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20,000 లాయల్టీ బెనిఫిట్ ఉన్నాయి. 2024 కైగర్ ఇప్పుడు టర్బో వెర్షన్ కోసం ఆటో ఫోల్డింగ్ ఓవీఆర్ఎంలు, రెడ్ బ్రేక్ కాలిపర్‌ల వంటి డిజైన్ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది.

ఇవే కాక ఎంపిక చేసిన కస్టమర్‌లకు అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తోంది. కార్పొరేట్ డిస్కౌంట్ తో పాటు లాయల్టీ బోనస్ అందిస్తోంది. రూ. 12,000 కార్పొరేట్ తగ్గింపు వర్తిస్తుంది. అయితే, కస్టమర్‌లు ఈ కార్పొరేట్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్ మధ్య ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి.

షరతులు వర్తిస్తాయి..

రెనాల్ట్ ఇండియా అందిస్తున్న ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ ఆఫర్లు కేవలం పాత మోడల్ క్విడ్, కైగర్, ట్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాదిలో ప్రారంభమైన 2024 మోడళ్లపై మాత్రం ఎటువంటి తగ్గింపులు ఉండవు. మరన్ని షరతులు, నిబంధనల పూర్తి వివరాలకు మీ సమీపంలోని రెనాల్ట్ డీలర్లను సంప్రదించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..