Reliance Jio True 5G: ఆంధ్రాలోని ఆ ఏడు నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు.. పూర్తి వివరాలు మీ కోసం..

|

Jan 24, 2023 | 4:21 PM

భారతదేశంలో డేటా వినియోగాన్ని ఉన్నఫలంగా పెంచిన రిలయన్స్ జియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా దూకుడుగా జియో ట్రూ 5జీ సేవ‌ల్ని ప్రారంభిస్తోంది. ఈ  క్రమంలో భాగంగానే 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని..

Reliance Jio True 5G: ఆంధ్రాలోని ఆ ఏడు నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు.. పూర్తి వివరాలు మీ కోసం..
Jio True 5g In Andhra Pradesh
Follow us on

భారతదేశంలో డేటా వినియోగాన్ని ఉన్నఫలంగా పెంచిన రిలయన్స్ జియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా దూకుడుగా జియో ట్రూ 5జీ సేవ‌ల్ని ప్రారంభిస్తోంది. ఈ  క్రమంలో భాగంగానే 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 పట్టణాల్లో జియో ట్రూ 5జీ ప్రారంభించినట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. వీటిలో కొత్తగా గోవా, హర్యానా, పుదుచ్చెరీ కూడా చేరాయి. కోటాలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హర్యానా సర్కిల్‌లో ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ జియో ట్రూ 5జీ సేవల్ని ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా 184 పట్టణాలు, నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన పట్టణాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్, కడప , నర్సారావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరంలో జియో ట్రూ 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి.

ఇక కొత్త సంవత్సరంలో ప్రతీ జియో యూజర్ జియో ట్రూ 5జీ సాంకేతిక పరివర్తన ప్రయోజనాలను ఆస్వాదించాలని తాము కోరుకుంటున్నామని, దేశవ్యాప్తంగా ట్రూ 5జీ రోల్‌అవుట్ వేగాన్ని, తీవ్రతను పెంచామని, 2023 డిసెంబర్ నాటికి దేశమంతా 5జీ సేవల్ని అందిస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది. జియో సేవలను అభివృద్ధి పరచడంలో తమకు సహకరించిన ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలకు రిలయన్స్ జియో కృతజ్ఞతలు తెలిపింది.

జియో వెల్‌కమ్ ఆఫర్:

జియో ట్రూ 5జీ సేవల లాంఛింగ్ సందర్భంగా రిలయన్స్ జియో తన కస్టమర్లకు జియో వెల్‌కమ్ ఆఫర్ అందిస్తోంది. జియో యూజర్లు ప్రస్తుతం ఉచితంగానే జియో 5జీ సేవల్ని వాడుకోవచ్చు. 1జీబీపీఎస్ వరకు స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా కోసం జియో యూజర్లు సిమ్ కార్డ్ మార్చాల్సిన అవసరం లేకుండా జియో 5జీ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

5జీ నెట్వర్క్ ఉపయోగించడం ఎలా.?

తమ స్మార్ట్‌ఫోన్‌లో జియో 5జీ ఉపయోగించలేకపోతున్నవారు మైజియో యాప్ ఓపెన్ చేసి ఇన్విటేషన్ వచ్చిందో లేదో చెక్ చేయాలి. ఇన్విటేషన్ ఉన్నా, పైన చెప్పిన సెట్టింగ్స్ మార్చినా మీరు 5జీ నెట్వర్క్ ఉపయోగించలేకపోతే ఓసారి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాలి. ఈ కింది సెట్టింగ్స్ మార్చి జియో 5జీ నెట్వర్క్ వాడుకోవచ్చు.

  1. ముందుగా ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
  2. ఆ తర్వాత Mobile network లేదా సిమ్ కార్డ్‌కు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
  3. అందులో Jio SIM పైన క్లిక్ చేయాలి.
  4. ఆ తర్వాత Preferred network type ఆప్షన్ క్లిక్ చేయాలి.
  5. 3G,4G, 5G ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
  6. మీరు 5G నెట్వర్క్ సెలెక్ట్ చేస్తే స్మార్ట్‌ఫోన్‌లో నెట్వర్క్ స్టేటస్ బార్‌లో 5G సింబల్ కనిపిస్తుంది.

ఇలా చేయడం ద్వారా మీరు జియో 5జీ నెట్వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. రిలయన్స్ జియో స్టాండలోన్ 5జీ నెట్వర్క్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అంటే జియో 5జీ నెట్వర్క్ 4జీ నెట్వర్క్‌పై ఆధారపడదు. అడ్వాన్స్‌డ్ 5జీ నెట్వర్క్ లభిస్తుంది. 5G కోసం రిలయన్స్ జియో దగ్గర 700MHz, 3500 MHz, 26 GHz బ్యాండ్‌లతో అతిపెద్ద, అత్యంత సముచితమైన వైర్‌లెస్ స్పెక్ట్రమ్ మిక్స్ ఉంది.

మరిన్ని  బిజినెస్ న్యూస్ కోసం