Jio Hotstar: ప్రపంచంలోనే జియో హాట్‌స్టార్ సరికొత్త రికార్డు.. అదేంటో తెలుసా..?

రిలయన్స్, వాల్ట్ డిస్నీల భాగస్వామ్యంతో ఏర్పడిన జియో హాట్‌స్టార్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇది ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద OTT ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. రిలయన్స్ జియో వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ ఈ విషయాన్ని విల్లడించారు.

Jio Hotstar: ప్రపంచంలోనే జియో హాట్‌స్టార్ సరికొత్త రికార్డు.. అదేంటో తెలుసా..?
Jiohotstar

Updated on: Aug 29, 2025 | 8:16 PM

సినిమా ప్రేక్షకులు, థియేటర్లు, టీవీలను చూడడం మానేసి.. ఎప్పుడూ అందుబాటులో ఉండే ఓటీటీపై ఎక్కువగా ఆదారపడుతున్నారు. దీంతో ఈ OTT ప్లాట్‌ఫామ్స్‌కు డిమాండ్‌ భారీగా పెరిగి పోయింది. ఈ క్రమంలో రిలయన్స్, వాల్ట్ డిస్నీల భాగస్వామ్యంతో ఏర్పడిన జియో హాట్‌స్టార్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద OTT ప్లాట్‌ఫామ్‌గా మారింది. మొత్తం టీవీ మార్కెట్‌లో 34% వాటాను కలిగి ఉన్న జియో, మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ, ఇతర కనెక్షన్ల ద్వారా వందల కోట్ల మందికి కంటెంట్‌ను అందిస్తోంది. అయితే ఈ సేవలను రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నట్టు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు.

ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో 3.20 లక్షల గంటల కంటెంట్ ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు ఆయన తెలిపారు. జియో తర్వాత రెండు ఓటీటీల కంటెంట్ కలిపినా, వాటిలో అంత పెద్ద మొత్తంలో కంటెంట్ లేదన్నారు. అదనంగా, జియో హాట్‌స్టార్ ప్రతి సంవత్సరం 30 వేల గంటలకు పైగా కంటెంట్‌ను యాడ్‌ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. జియో హాట్‌స్టార్‌లో టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లతో సహా 600 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారని ఆయన అన్నారు. వీరిలో 300 మిలియన్ల మంది వినియోగదారులు చందాదారులకు చెల్లించి కంటెంట్‌ను చూస్తున్నారు.

తాము హాట్‌స్టార్‌తో చేతులు కలపడం ద్వారా ఈ ఫీట్‌ను చేరుకోగలిగామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతంలో ప్రపంచంలో నెట్‌ఫ్లిక్స్ మొదటి స్థానంలో ఉందగా. జియో హాట్‌స్టార్ రెండవ స్థానంలో ఉందని.. అమెజాన్ మూడవ స్థానంలో ఆన్నట్టు ఆయన తెలిపారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.