Recurring Deposit: రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ కోసం పోస్టాఫీసు.. ఎస్‌బీఐ.. ఇందులో ఏదీ బెటర్‌

కరింగ్‌ డిపాజిట్‌ దాదాపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కి సమానమైన వడ్డీని పొందవచ్చు. ఆర్డీ (రికరింగ్ డిపాజిట్) నిర్వహించడం కూడా చాలా సులభం. ఇది ప్రజలలో పొదుపు ధోరణిని పెంచుతుంది. దాదాపు అన్ని బ్యాంకులు రికరింగ్ డిపాజిట్ పథకాన్ని కలిగి ఉన్నాయి. నెలకు కనీసం రూ. 100 నుంచి ప్రారంభించి మీకు కావలసినంత డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. బ్యాంకుల్లోనే కాకుండా పోస్టాఫీసుల్లో కూడా ఆర్డీ ఖాతా తెరవవచ్చు. ఇక్కడ కూడా నెలకు కనీసం రూ.100 పెట్టుబడి..

Recurring Deposit: రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ కోసం పోస్టాఫీసు.. ఎస్‌బీఐ.. ఇందులో ఏదీ బెటర్‌
Rd Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Sep 13, 2023 | 6:08 PM

రికరింగ్ డిపాజిట్ అనేది చాలా సులభమైన, ఉపయోగకరమైన పొదుపు పథకం. మీరు ప్రతి నెల ఈ డిపాజిట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ మొత్తంలో అందుకునే అవకాశం  ఉంటుంది. రికరింగ్‌ డిపాజిట్‌ దాదాపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కి సమానమైన వడ్డీని పొందవచ్చు. ఆర్డీ (రికరింగ్ డిపాజిట్) నిర్వహించడం కూడా చాలా సులభం. ఇది ప్రజలలో పొదుపు ధోరణిని పెంచుతుంది. దాదాపు అన్ని బ్యాంకులు రికరింగ్ డిపాజిట్ పథకాన్ని కలిగి ఉన్నాయి. నెలకు కనీసం రూ. 100 నుంచి ప్రారంభించి మీకు కావలసినంత డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. బ్యాంకుల్లోనే కాకుండా పోస్టాఫీసుల్లో కూడా ఆర్డీ ఖాతా తెరవవచ్చు. ఇక్కడ కూడా నెలకు కనీసం రూ.100 పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

రికరింగ్ డిపాజిట్ అంటే ఏమిటి?

  • రికరింగ్ డిపాజిట్ అంటే డబ్బు పెట్టడం వల్ల మంచి ఆదాయం అందుకోవచ్చు. మీరు ఆర్బీలో ప్రతి నెల క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు.
  • ఆర్‌డీ అనేది మీ నెలవారీ పొదుపులను పెట్టుబడి కోసం ఉపయోగించడానికి ఒక పథకం.
  • మీరు ఆరు నెలల నుంచి 10 సంవత్సరాల వరకు ప్రతి నెల ఆర్డీ ఖాతాలో డబ్బు జమ చేయవచ్చు.
  • దీని కోసం లాక్-ఇన్ పీరియడ్ ఒకటి నుంచి మూడు నెలల వరకు ఉంటుంది. అంటే మీరు ఆర్డీ ఖాతాను తెరిచిన తర్వాత, లాక్-ఇన్ వ్యవధి వరకు దాన్ని రద్దు చేయడం సాధ్యం కాదు.
  • బ్యాంకులలో, ప్రతి నెలా మీ ఖాతా నుండి RD ఖాతాకు కొంత మొత్తాన్ని ఆటోమేటిక్‌గా బదిలీ చేసే అవకాశం ఉంది.

ఎస్‌బీఐలో ఆర్డీకి ఎంత వడ్డీ లభిస్తుంది?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రికరింగ్ డిపాజిట్ కోసం సంవత్సరానికి 6.5 శాతం నుంచి 7 శాత వరకు వడ్డీ చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్లకు అర శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీఐ రెండు నుంచి మూడు సంవత్సరాల ఆర్డీ పథకం కోసం గరిష్ట వడ్డీని అందిస్తుంది. ఇతర ప్రధాన వాణిజ్య బ్యాంకులు కూడా దాదాపు అదే ఆర్‌డీ రేట్లు కలిగి ఉన్నాయి.

పోస్టాఫీసులో ఆర్‌డీకి వడ్డీ ఎంత?

పోస్టాఫీసులో ఆర్‌డీ పథకం 5 సంవత్సరాలు. నెలకు కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాలి. ఈ ఐదేళ్ల ఆర్డీ స్కీమ్‌కు సంవత్సరానికి 6.5 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

ఆర్‌డిపై పన్ను విధించారా?

ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే, రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. ఆర్‌డీ నుంచి ఏడాదిలో వచ్చే వడ్డీ మొత్తం రూ.10,000 దాటితే వచ్చే ఆదాయం రూ. 10% టీడీఎస్‌ కట్‌ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!