AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Buy: ఇల్లు కొనేకంటే ఒకేసారి రూ. 28 లక్షలతో ఇలా చేస్తే.. రూ. 6 కోట్లు మీ సొంతం.!

మధ్యతరగతి కుటుంబంలో సొంత ఇల్లు అనేది ఒక కల. మొదటి ఇల్లు మన అవసరం కోసం కొనుక్కుంటాం, కానీ రెండో ఇల్లు కొనేటప్పుడు మాత్రం దానిని కేవలం పెట్టుబడి దృక్పథంతోనే చూడాలి. ఆ ఇల్లు మనకు భవిష్యత్తులో ఎంత రాబడి ఇస్తుంది, దాని నిర్వహణ ఖర్చులు ఎంత ఉంటాయి అనేది విశ్లేషించాలి.. ఆ వివరాలు..

House Buy: ఇల్లు కొనేకంటే ఒకేసారి రూ. 28 లక్షలతో ఇలా చేస్తే.. రూ. 6 కోట్లు మీ సొంతం.!
Representative Image
Ravi Kiran
|

Updated on: May 11, 2026 | 7:44 AM

Share

సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరి దగ్గరైనా కొంచెం ఎక్కువ డబ్బు ఉంటే, మొదట వచ్చే ఆలోచన “మరో ఇల్లు కొందాం” అని. ఇప్పటికే ఒక సొంత ఇల్లు ఉన్నా, రెండో ఇంటిని ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తుంటాం. బ్యాంకు లోన్ తీసుకుని, వచ్చే రెంట్ ద్వారా ఈఎంఐ చెల్లించేసి, ఒక ఆస్తిని వెనక వేయాలనేది చాలా మంది ప్లాన్. అయితే, ఈ పద్ధతి ఆర్థికంగా ఎంతవరకు లాభదాయకం? బిజినెస్ నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఒక కోటి రూపాయల ఇంటిని ఉదాహరణగా తీసుకుందాం. దీని కోసం మీరు సుమారు 28 లక్షల రూపాయలు(డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇంటీరియర్) మొదట ఖర్చు చేయాలి. మిగిలిన 80 లక్షల లోన్ మీద నెలకు 70 వేల ఈఎంఐ పడుతుంది. రెంట్ ఒక 30 వేలు వచ్చినా, మీరు మీ జేబు నుండి నెలకు మరో 30 నుంచి 40 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 20 ఏళ్ల తర్వాత ఆ ఇంటి విలువ సుమారు 4 కోట్లు అవ్వచ్చు. కానీ, ఇదే మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే లెక్కలు మారుతాయి.

మొదట పెట్టిన 28 లక్షలను లంసమ్‌గా, నెలకు కట్టే 30 వేల రూపాయలను ఎస్ఐపీగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, 20 ఏళ్ల తర్వాత సగటున 12-13 శాతం రాబడితో మీ సంపద 6 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది. అంటే, ఇంటి మీద వచ్చే లాభం కంటే ఇది దాదాపు 2 కోట్లు ఎక్కువ. ఇక్కడే మనం ఆలోచించాల్సిన మరో విషయం ‘లిక్విడిటీ’. అత్యవసరంగా డబ్బు కావాల్సి వస్తే కోటి రూపాయల ఇంటిని వెంటనే అమ్మలేము, కానీ మ్యూచువల్ ఫండ్స్ నుండి మనకు కావాల్సినంత డబ్బును ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు.

అంతేకాకుండా, ఇంటికి మెయింటెనెన్స్ ఖర్చులు, అద్దెకు ఉండేవారి సమస్యలు, బిల్డింగ్ తరుగుదల వంటివి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో అవేమీ ఉండవు. అయితే, ఇది కేవలం ఒక ఆర్థిక విశ్లేషణ మాత్రమే. రియల్ ఎస్టేట్ అనేది ఒక భౌతిక ఆస్తి కాబట్టి చాలామంది దానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ, సంపద సృష్టించడమే లక్ష్యం అయితే మాత్రం డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో ఉండటం మంచిదని బిజినెస్ నిపుణులు అంటున్నారు. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒక ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, మీ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం బెటర్ అని చెబుతున్నారు.

Follow Us
ఇల్లు కొనేకంటే బెస్ట్ ఐడియా ఇది.. ఓ సారి చూసేయండి.
ఇల్లు కొనేకంటే బెస్ట్ ఐడియా ఇది.. ఓ సారి చూసేయండి.
తెల్ల జుట్టు నల్లగా మారాలా.. పైసా ఖర్చు లేకుండా మీ ఇంట్లోని..
తెల్ల జుట్టు నల్లగా మారాలా.. పైసా ఖర్చు లేకుండా మీ ఇంట్లోని..
ప్లేఆఫ్స్ రేసులో దూసుకొచ్చిన చెన్నై.. టాప్-4 చేరాలంటే ఏం చేయాలి?
ప్లేఆఫ్స్ రేసులో దూసుకొచ్చిన చెన్నై.. టాప్-4 చేరాలంటే ఏం చేయాలి?
కోహ్లీకి కోలుకోలేని దెబ్బ.. ఆరెంజ్ క్యాప్ రేసులో కింగ్ వెనక్కి
కోహ్లీకి కోలుకోలేని దెబ్బ.. ఆరెంజ్ క్యాప్ రేసులో కింగ్ వెనక్కి
స్పోర్ట్స్‌ బైక్‌ బీభత్సం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి
స్పోర్ట్స్‌ బైక్‌ బీభత్సం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి
నెక్ట్స్ టార్గెట్‌ తెలంగాణే.. మోదీ సభతో బీజేపీ నేతల్లో కొత్త జోష్
నెక్ట్స్ టార్గెట్‌ తెలంగాణే.. మోదీ సభతో బీజేపీ నేతల్లో కొత్త జోష్
అతి తక్కువ టైమ్‌లో రూ.17 లక్షలు కావాలా?
అతి తక్కువ టైమ్‌లో రూ.17 లక్షలు కావాలా?
మీరు స్నానం చేసే నీటిలో ఆ ఆకులు వేస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం..
మీరు స్నానం చేసే నీటిలో ఆ ఆకులు వేస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం..
120 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన 18 ఏళ్ల కుర్రాడు.. అరంగేట్రంలోనే
120 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన 18 ఏళ్ల కుర్రాడు.. అరంగేట్రంలోనే
ప్లేఆఫ్స్ రేసులో టాప్‌లోకి బెంగళూరు.. క్వాలిఫై అవుతుందా ?
ప్లేఆఫ్స్ రేసులో టాప్‌లోకి బెంగళూరు.. క్వాలిఫై అవుతుందా ?