Hyderabad: భాగ్యనగరంలో పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం.. ఏకంగా 130శాతం పెరుగుదల..

|

Nov 18, 2022 | 12:47 PM

హైదరాబాద్‌ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత జోరందుకుంది. కరోనా పరిస్థితుల అనంతరం చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు.

Hyderabad: భాగ్యనగరంలో పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం.. ఏకంగా 130శాతం పెరుగుదల..
Real Estate In Hyderabad
Follow us on

హైదరాబాద్‌ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత జోరందుకుంది. కరోనా పరిస్థితుల అనంతరం చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. మారుతున్న పరిణామాలతో మళ్లీ రియల్‌ ఎస్టేట్‌కు పూర్వ వైభవం వస్తుండటం.. వ్యాపార వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ నగరంలో పెరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిమాండ్‌ అనుగుణంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో క్రయవిక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఎన్నారైలతోపాటు, వ్యాపార వర్గాలు సైతం రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుండడం కూడా ఈ రంగానికి మరింత జోష్ వచ్చింది. ప్రస్తుతం భాగ్యనగర సరిహద్దుల్లో రియల్ ఎస్టేట్ మరింత పెరిగింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏకంగా 130 శాతం వృద్ధి సాధించినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ పేర్కొంది. గతంతో పోలిస్తే భారీగా క్రయవిక్రయాలు జరిగినట్లు తెలిపింది.

ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మొదటి ఏడు నగరాల్లో విక్రయించిన రెసిడెన్షియల్ హౌసింగ్ యూనిట్లు.. గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ఆసక్తికరంగా, ఈ కాలంలో హైదరాబాద్ మొత్తం గృహాల విక్రయ విలువలలో 130 శాతం పెరగడం దీనికి అద్దంపడుతోంది. భాగ్యనగరంలో హౌసింగ్ విక్రయాలు H1 FY22లో రూ.6,926 కోట్ల నుంచి H1 FY23లో రూ.15,958 కోట్లకు చేరుకున్నట్లు అనరాక్ పేర్కొంది. వచ్చే సంవత్సరం FY 2022- 23 ప్రథమార్థంలో హైదరాబాద్‌లో దాదాపు 22,840 గృహాలు క్రయవిక్రయాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ముంబై, ఢిల్లీలో.. 

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), ఢిల్లీ – NCR, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పూణే సహా పలు నగరాలు 2022 – 23 ఆర్ధిక సంవత్సరంలో మొదటి అర్ధభాగంలో రూ. 1,55,833 కోట్ల విలువైన గృహాల విక్రయం జరిగింది. ఇది ఏటా 119 శాతం పెరిగింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ పరిశోధన ప్రకారం.. FY22 సంబంధిత కాలంలో విక్రయించిన యూనిట్ల మొత్తం విలువ దాదాపు రూ.71,295 కోట్లు అని పేర్కొంది.

ఏప్రిల్ – సెప్టెంబర్ 2022 మధ్య మొదటి ఏడు నగరాల్లో దాదాపు 1,73,155 గృహాలు అమ్ముడయ్యాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో దాదాపు 87,375 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు తెలిపింది.

అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి మాట్లాడుతూ.. “విలువ పరంగా H1 FY23లో రూ. 74,835 కోట్ల విలువైన గృహ విక్రయాలతో ముంబై (MMR) అగ్రస్థానంలో ఉందన్నారు. రూ.24,374 కోట్ల విక్రయాలతో NCR తర్వాతి స్థానంలో ఉంది. MMR మొత్తం గృహ విక్రయాల విలువలో 110 శాతం వార్షిక లాభాన్ని పొందగా (H1 FY22లో ఇది రూ. 35,610 కోట్లు), NCR పరిధిలో క్రయవిక్రయాల్లో 174 శాతం పెరిగిందన్నారు.

H1 FY22లో NCR మొత్తం రూ. 8,896 కోట్ల విలువైన గృహ విక్రయాలు నమోదైనట్లు పూరి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో దాదాపు 52,185 గృహాలు MMRలో విక్రయాలు జరిగాయి. అదే సమయంలో NCR దాదాపు 30,300 యూనిట్ల విక్రయాలను చూసింది. వాల్యూమ్, విలువ పరంగా హౌసింగ్ విక్రయాలలో ముంబై అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ, హైదరాబాద్ ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..