RBI: కరెన్సీ నోటుపై రవీంద్రనాథ్ ఠాగూర్‌, అబ్దుల్‌ కలాం ఫొటోలంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ..

దేశంలోని కరెన్సీపై మహాత్మా గాంధీ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సోమవారం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న కరెన్సీ నోట్లలో మార్పులు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తున్నట్లు మీడియాలో కొన్ని చోట్ల వార్తలు వస్తున్నాయని చెప్పింది...

RBI: కరెన్సీ నోటుపై రవీంద్రనాథ్ ఠాగూర్‌, అబ్దుల్‌ కలాం ఫొటోలంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 06, 2022 | 3:37 PM

దేశంలోని కరెన్సీపై మహాత్మా గాంధీ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సోమవారం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న కరెన్సీ నోట్లలో మార్పులు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తున్నట్లు మీడియాలో కొన్ని చోట్ల వార్తలు వస్తున్నాయని చెప్పింది. రిజర్వ్ బ్యాంక్‌లో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని గమనించాలని కోరింది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఫోటోను మొదటిసారిగా కరెన్సీపై ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోందని ఇంతకుముందు మీడియా వార్తలు వచ్చాయి. నోట్‌లో ఈ మార్పు తీసుకురావడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బిఐ త్వరలో పెద్ద అడుగు వేయవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక నివేదిక పేర్కొంది. దీన్ని రెండు సెట్‌లుగా తయారు చేసి ఐఐటీ ఢిల్లీ ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌ దిలీప్‌ టి షాహానీకి పంపారని. ఈ సెట్‌లలో ఒకదాన్ని ఎంచుకునే బాధ్యత ప్రొఫెసర్ సాహ్నికి అప్పగించారని పేర్కొంది.

1969లో మొదటిసారిగా గాంధీజీ ఫొటోను భారతీయ రిజర్వ్ బ్యాంక్ 100 రూపాయల నోటుపై ముద్రించింది. గాంధీజీ ప్రస్తుత చిత్రపటాన్ని కలిగి ఉన్న కరెన్సీ నోట్లను తొలిసారిగా 1987లో ప్రవేశపెట్టారు. గాంధీజీ చిరునవ్వుతో కూడిన ఈ చిత్రంతో 1987 అక్టోబర్‌లో తొలిసారిగా 500 రూపాయల నోటును ప్రవేశపెట్టారు. దీని తర్వాత, గాంధీజీ చిత్రాన్ని ఇతర కరెన్సీ నోట్లలో కూడా ఉపయోగించడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ