RBI Repo Rate: ఆర్బీఐ గుడ్ న్యూస్.. హోమ్ లోన్లపై ఆ భారం లేనట్లే..

హోమ్ లోన్ వినియోగదారులకు ఇది గుడ్ న్యూస్.. ఇప్పటికే మీకు లోన్ ఉన్నా.. తీసుకోవాలనుకుంటున్నా.. ఇబ్బంది లేదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన రెపోరేటును యథాతథంగా ఉంచింది. అంటే 6.50 శాతం వద్ద కొనసాగించింది. ఇటీవల జరిగిన ద్రవ్యవిధాన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది. రెపోరేటు మారకపోవడంతో హోమ్ లోన్ల ఈఎంఐలు తగ్గకపోవచ్చు.

RBI Repo Rate: ఆర్బీఐ గుడ్ న్యూస్.. హోమ్ లోన్లపై ఆ భారం లేనట్లే..
Rbi
Follow us

|

Updated on: Jun 08, 2024 | 2:54 PM

హోమ్ లోన్ వినియోగదారులకు ఇది గుడ్ న్యూస్.. ఇప్పటికే మీకు లోన్ ఉన్నా.. తీసుకోవాలనుకుంటున్నా.. ఇబ్బంది లేదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన రెపోరేటును యథాతథంగా ఉంచింది. అంటే 6.50 శాతం వద్ద కొనసాగించింది. ఇటీవల జరిగిన ద్రవ్యవిధాన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది. రెపోరేటు మారకపోవడంతో హోమ్ లోన్ల ఈఎంఐలు తగ్గకపోవచ్చు. పాత పద్ధతిలోనే కొనసాగే అవకాశాలున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, జీడీపీ పెరుగుదల నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.

వడ్డీరేటుపై ప్రభావం..

రెపోరేటు అనేది రుణాలపై వడ్డీరేటును ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం రుణం తీసుకోవడానికి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. రుణగ్రహీతలు తమ రుణాలను మరింత సమర్థంగా నిర్వహించడానికి కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకోవడం అవసరం. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటు కొత్తగా తీసుకునేవారు కూడా కొన్ని విధానాలను అనుసరించాలి. ఆర్బీఐ నిర్ణయంతో గృహ రుణ గ్రహీతలు ఇప్పటికే చెల్లిస్తున్న ఈఎంఐలను కొనసాగించాలి. అధిక వడ్డీ రేట్లు పెరిగిన నెలవారీ చెల్లింపులపై ప్రభావం చూపుతాయి. అలాగే కొత్త రుణగ్రహీతలు కూడా అధిక వడ్డీ రేట్ల భారాన్ని ఎదుర్కొంటారు.

ఆర్థిక లక్ష్యాలకు ఆటంకం లేకుండా..

  • అధిక వడ్డీరేట్ల వల్ల కలిగే నష్టాల నుంచి తప్పించుకోవడానికి రుణగ్రహీతలు కొన్ని చిట్కాలు పాటించాలి. తద్వారా ఆర్థిక లక్ష్యాలకు ఆటంకం కలగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రుణం తీసుకున్న వారు ఈ కింద తెలిపిన పద్ధతులు పాటించాలి.
  • రుణాలను రీఫైనాన్స్ చేసుకునే విషయాన్ని ఆలోచించాలి. దీని వల్ల మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. అయితే దానికయ్యే ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర సంబంధిత ఖర్చులను జాగ్రత్తగా లెక్కించాలి.
  • వడ్డీరేటు ఎక్కువ అనుకుంటే మీ రుణదాతతో చర్చించండి. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో తమ ఖాతాదారులను నిలుపుకొనేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తాయి. ఇందులో భాగంగా వడ్డీరేటును తగ్గించే అవకాశం ఉంది.
  • రుణం మొత్తానికి పాక్షిక ముందస్తు చెల్లింపులు చేయడం కూడా మంచి ఆలోచన. దీనివల్ల ఈఎమ్ఐలపై వడ్డీ తగ్గుతుంది. చిన్న, సాధారణ ముందస్తు చెల్లింపులు కూడా వడ్డీని గణనీయంగా తగ్గించగలవు.
  • స్థిర రేటు గృహ రుణానికి మారడం వల్ల కూడా ఈఎమ్ఐలలో మార్పులు ఉండవు. భవిష్యత్తులో హెచ్చుతగ్గులకు లేకుండా నిశ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది.

కొత్త రుణగ్రహీతలకు చిట్కాలు..

  • కొత్తగా రుణాలు తీసుకునేవారు వివిధ బ్యాంకుల వడ్డీరేట్లను పరిశీలించాలి. వాటిలో స్వల్ప వ్యత్సాసాలు కూడా మీకు గణనీయమైన పొదుపును అందిస్తాయి. ఆన్‌లైన్ లో పరిశోధించడం, ఆర్థిక సలహాదారులను సంప్రదించడం ఉత్తమం.
  • ఫిక్స్ డ్, ఫ్లోటింగ్ వడ్డీరేట్లను సరిగ్గా అంచనా వేయండి. ఫిక్స్ డ్ రేట్ రుణాలు స్థిరమైన విధానాలను కలిగి ఉంటాయి. భవిష్యత్తులో రేట్లు తగ్గుతాయని భావిస్తే ఫ్లోటింగ్ రేటు రుణాలతో ప్రయోజనం కలుగుతుంది.
  • సరైన రుణ కాల వ్యవధిని ఎంచుకోవడం చాలా కీలకం. తక్కువ కాలవ్యవధి కలిగిన ఈఎమ్ ఐల మొత్తం ఎక్కువగా ఉంటుంది. కానీ చెల్లించే వడ్డీ తగ్గుతుంది. ఎక్కువ కాల వ్యవధి ఈఎమ్ ఐలు తక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ వడ్డీని ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది.
  • మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశం ఉంటుంది. అలాగే డౌన్ పేమెంట్ ను ఎక్కువగా కట్టడం వల్ల రుణ మొత్తం తగ్గుతుంది, తద్వారా వడ్డీ భారం తగ్గుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్