FD Interest Rates: డిపాజిటర్లకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీలపై పెరిగిన వడ్డీ.. ఏ బ్యాంకులో ఎక్కువంటే..

రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల బల్క్ డిపాజిట్ నిబంధనలు మార్పులు చేసింది. ఎఫ్ డీ లలో సాధారణంగా రిటైల్, బల్క్ డిపాజిట్లు అనే రకాలు ఉంటాయి. గతంలో రూ.రెండు కోట్ల లోపు వాటిని రిటైల్ గా, రూ.రెండు కోట్లు దాటిన వాటిని బల్క్ డిపాజిట్లు గా భావించేవారు. సాధారణ వాటితో పోల్చితే బల్క్ డిపాజిట్లకు వడ్డీ తక్కువ ఉంటుంది. ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు ఇకపై రూ.3 కోట్ల లోపు డిపాజిట్ల ను రిటైల్ గా పరిగణిస్తారు.

FD Interest Rates: డిపాజిటర్లకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీలపై పెరిగిన వడ్డీ.. ఏ బ్యాంకులో ఎక్కువంటే..
Fd Deposit
Follow us

|

Updated on: Jun 16, 2024 | 5:22 PM

బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలకు ప్రజల ఆదరణ ఎంతో ఉంది. వాటిలో పెట్టుబడులు పెట్టడం సురక్షితమని భావిస్తారు. నిర్ణీత కాలవ్యవధిలో వడ్డీతో కలిసి పెట్టుబడిని తీసుకునే అవకాశం వీటిలో ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు తమ డబ్బులను ఎఫ్ డీలలో ఇన్వెస్ట్ చేస్తారు. వారి కోసం బ్యాంకులు ప్రత్యేకంగా వడ్డీరేటును అమలు చేస్తున్నాయి.

ఆర్బీఐ తాజా నిబంధనలు..

రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల బల్క్ డిపాజిట్ నిబంధనలు మార్పులు చేసింది. ఎఫ్ డీ లలో సాధారణంగా రిటైల్, బల్క్ డిపాజిట్లు అనే రకాలు ఉంటాయి. గతంలో రూ.రెండు కోట్ల లోపు వాటిని రిటైల్ గా, రూ.రెండు కోట్లు దాటిన వాటిని బల్క్ డిపాజిట్లు గా భావించేవారు. సాధారణ వాటితో పోల్చితే బల్క్ డిపాజిట్లకు వడ్డీ తక్కువ ఉంటుంది. ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు ఇకపై రూ.3 కోట్ల లోపు డిపాజిట్ల ను రిటైల్ గా పరిగణిస్తారు. ఆ పై వాటిని బల్క్ డిపాజిట్లగా గుర్తిస్తారు. దీని వల్ల ఎఫ్ డీలలో పెట్టుబడి పెట్టేవారికి ప్రయోజనం కలుగుతుంది.

వివిధ బ్యాంకులలో వడ్డీరేట్లు..

బల్క్ డిపాజిట్ల పై ఆర్బీఐ తీసుకున్ననిర్ణయంతో ప్రముఖ బ్యాంకులు ఎఫ్ డీలపై వడ్డీరేట్లను సవరించాయి. ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై అవి అందించే వడ్డీ రేట్లు ఈ కింద తెలిపిన విధంగా ఉన్నాయి.

ఎస్ బ్యాంక్.. ఈ బ్యాంకు జూన్ 8వ తేదీ నుంచి తన తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను సవరించింది. ఆ ప్రకారం సాధారణ ఖాతాదారులకు ఏడాదికి 3.25 నుంచి 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75 నుంచి 8.5 శాతం వడ్డీ ఇస్తుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సాధారణ ఖాతాదారులకు ఏడాదికి 3 నుంచి 7.3 శాతం, అలాగే సీనియర్ సిటిజన్లకు 3 శాతం నుంచి 7.8 శాతం వరకూ, సూపర్ సీనియర్ సిటిజన్ల కు 3 శాతం నుంచి 7.95 శాతం వరకూ వడ్డీ అందిస్తుంది.

యాక్సిస్ బ్యాంక్.. ఈ బ్యాంక్ రిటైల్ డిపాజిట్ మొత్తాన్ని రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు అప్‌డేట్ చేసింది. సాధారణ కస్టమర్లకు 3 నుంచి 7.20 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుంచి 7.85 శాతం వడ్డీ అందిస్తుంది.

హెచ్ డీఎఫ్సీ.. ఈ బ్యాంకు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. రిటైల్ డిపాజిట్ పరిమితిని రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంచింది. ఎఫ్ డీలపై సాధారణ ఖాతాదారులకు 3 నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుంచి 7.75 శాతం వడ్డీరేట్లను అమలు చేస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్.. ప్రైవేట్ రంగ రుణదాత అయిన ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎఫ్ డీ రేట్లను సవరించలేదు. సాధారణ కస్టమర్‌లకు 3 నుంచి 7.2 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుంచి 7.75 శాతం వడ్డీని అందిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఈ బ్యాంకు జూన్ 12వ తేదీ నుంచి ఎఫ్ డీ రేట్లను సవరించింది . సాధారణ ఖాతాదారులకు 4.25 నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం నుంచి 7.75 శాతం వడ్డీని అందిస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ).. ఈ బ్యాంకులో జూన్ 12వ తేదీ నుంచి ఎఫ్ డీ రేట్లలో మారాయి. రిటైల్ డిపాజిట్ మొత్తం ప రిమితి పెరిగింది. సాధారణ ఖాతాదారులకు 3.5 నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 నుంచి 7.75 శాతం వరకూ వడ్డీని అందిస్తుంది.

కెనరా బ్యాంక్.. ఫిక్స్ డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 4 నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 నుంచి 7.75 శాతం వడ్డీ అందిస్తోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. ఎస్బీఐలో సాధారణ కస్టమర్లకు 3.50 నుంచి 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 నుంచి 7.6 శాతం వడ్డీరేటును ఎఫ్ డీలపై అమలు చేస్తుంది.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. ఈ బ్యాంకులో ఎఫ్ డీలపై సాధారణ ప్రజలకు 2.8 నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 2.8 నుంచి 7.75 శాతం వడ్డీరేటు లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles