Bank Services: బ్యాంకు ఖాతా కలిగిన వారు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ ఓ కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్‌లో తరచూగా డబ్బులు పంపే వారు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలని సూచించింది. లేదంటే కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మే 23వ తేదీన నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) సర్వీసులు 14 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది. ఈ విషయాన్ని ఆర్బీఐ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
మెరుగైన సేవలు అందించడం కోసం టెక్నికల్ అప్‌గ్రేడ్ కారణంగా నెఫ్ట్ సేవలు 14 గంటల పాటు అంతరాయం కలుగనుందని ఆర్బీఐ పేర్కొంది. మే 23న అంటే ఆదివారం 00.01 గంటల నుంచి 14.00 గంటల వరకు నెఫ్ట్ సేవలు కస్టమర్లకు అందుబాటులో ఉండవు. అయితే ఆర్‌టీజీఎస్ సర్వీసులు మాత్రం అందుబాటులోనే ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ ప్రకటన నేపథ్యంలో బ్యాంకులు కూడా వారి కస్టమర్లను ఈ విషయమై అప్రమత్తం చేయవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో బ్యాంకు కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా టెక్నికల్ పరంగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఆ సమయంలో బ్యాంకు కస్టమర్లకు పలు సేవలు కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండవు. ఇలాంటి విషయాలను ఆర్బీఐ లేదా ఆర్బీఐ ముందస్తుగా కస్టమర్లను అలర్ట్ చేస్తున్నాయి.
NEFT System Upgrade – Downtime from 00.01 Hrs to 14.00 Hrs. on Sunday, May 23, 2021https://t.co/i3ioh6r7AY
— ReserveBankOfIndia (@RBI) May 17, 2021
ఇవీ చదవండి: