Ratan Tata Salary: రతన్‌ టాటా వేతనం ఎంతో తెలుసా..? ఆశ్చర్యపర్చే నిజాలు!

|

Oct 11, 2024 | 7:09 PM

రతన్ టాటా టాటా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్, దేశీయ పారిశ్రామికవేత్త నుండి ప్రపంచ స్థాయికి ఎదిగారు. అతను తన దాతృత్వానికి, వినయానికి అలాగే అతని వ్యాపార చతురతకు ప్రసిద్ధి చెందారు. రతన్‌ టాటా అంటేనే మానవత్వానికి మారుపేరు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడంతో బాధాకరం. రతన్‌ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే..

Ratan Tata Salary: రతన్‌ టాటా వేతనం ఎంతో తెలుసా..? ఆశ్చర్యపర్చే నిజాలు!
Ratan Tata Salary
Follow us on

రతన్ టాటా టాటా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్, దేశీయ పారిశ్రామికవేత్త నుండి ప్రపంచ స్థాయికి ఎదిగారు. అతను తన దాతృత్వానికి, వినయానికి అలాగే అతని వ్యాపార చతురతకు ప్రసిద్ధి చెందారు. రతన్‌ టాటా అంటేనే మానవత్వానికి మారుపేరు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడంతో బాధాకరం. రతన్‌ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేసిన కృషి, సేవలు వెలకట్టలేనివి. రతన్ టాటా 1991–2012 వరకు టాటా గ్రూప్, టాటా సన్స్‌కు చైర్మన్‌గా పనిచేశారు. పదవీ విరమణకు ముందు అక్టోబర్ 2016–జనవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్‌గా పనిచేశారు. టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా ఎంత జీతం పొందారు?

ఇది కూడా చదవండి: Gold Price: వామ్మో.. ఒక్క రోజులోనే ఇంత పెరిగిందా? పండగకు ముందు భారీగా పెరిగిన బంగారం ధర!

రతన్ టాటా జీతం

వివిధ నివేదికల ప్రకారం, రతన్ టాటా టాటా గ్రూప్, టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రూ.2.5 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. అంటే, వ్యాపారవేత్త నెలకు దాదాపు రూ. 20.83 లక్షలు. రోజుకు రూ. 70,000.. గంటకు దాదాపు రూ.2,900.. నిమిషానికి దాదాపు రూ. 48-49. గౌతమ్ అదానీ వంటి ఇతర బిలియనీర్ల కంటే చాలా తక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ నిమిషానికి రూ.3.09 లక్షలు సంపాదిస్తారు. అంటే సెకనుకు దాదాపు రూ. 51,250, రతన్ టాటా ఒక రోజులో సంపాదిస్తారు.

ఇది కూడా చదవండి: Noel Tata: ఇప్పుడు రతన్‌ టాటా బాధ్యతలు చేపట్టే నోయెల్‌ టాటా ఎవరో తెలుసా?

రతన్ టాటా జీతం ఎందుకు తక్కువ?

రతన్ టాటా ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపార రంగాలలో ఒకదానికి అధిపతిగా, యజమానిగా ఉన్నప్పటికీ ఇతర ఉన్నత-మధ్య-స్థాయి కార్పొరేట్ ఉద్యోగి కంటే తక్కువ వేతనం ఎందుకు పొందారని అనుకోవచ్చు.

రతన్ టాటా భారీ వ్యక్తిగత సంపదను కూడగట్టుకునే బదులు జంతువుల కోసం అనేక స్వచ్ఛంద సంస్థలను నిర్వహించడమే కాకుండా వైద్యం, విద్య, పరిశోధన రంగాలలో దాతృత్వ వెంచర్‌ల కోసం తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని వెచ్చించేరని నివేదికలు సూచిస్తున్నాయి. రతన్‌ టాటా జీతం ఎంత తీసుకున్నా.. అందులో దాదాపు 60 నుంచి 65 శాతం వరకు పేదలకు విరాళాలు, స్వచ్చంధ సంస్థలకు ఇచ్చేవారట. అందుకే రతన్‌ టాటా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

ఇది కూడా చదవండి: Ratan Tata: రతన్‌ టాటా గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

రతన్ టాటా నికర ఆదాయం:

తన జీతం కాకుండా, రతన్ టాటా తన స్మార్ట్ పెట్టుబడులు, షేర్లతో సహా అనేక ఇతర వనరుల నుండి అదనపు ఆదాయాన్ని పొందారు. అయినప్పటికీ వారి ఉమ్మడి ఆదాయం ఖచ్చితమైన సంఖ్య బహిరంగంగా అందుబాటులో లేదు. ఇటీవలి నివేదికల ప్రకారం, రతన్ టాటా నికర విలువ రూ.3,800 కోట్లుగా అంచనా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి