AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart TV: 43 అంగుళాల టీవీ రూ. 12,999కే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్‌!

పండుగ సీజన్ సేల్‌లో కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌ల నుండి స్మార్ట్ టీవీ మోడల్‌ల వరకు ప్రతిదానిపై భారీ తగ్గింపులను పొందుతున్నారు. మీరు ఇల్లు లేదా ఆఫీస్ కోసం కొత్త LED టీవీని కూడా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్‌లో టీవీ మోడళ్లపై అందుబాటులో ఉన్న ఉత్తమ..

Smart TV: 43 అంగుళాల టీవీ రూ. 12,999కే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్‌!
Subhash Goud
|

Updated on: Oct 12, 2024 | 5:24 PM

Share

పండుగ సీజన్ సేల్‌లో కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌ల నుండి స్మార్ట్ టీవీ మోడల్‌ల వరకు ప్రతిదానిపై భారీ తగ్గింపులను పొందుతున్నారు. మీరు ఇల్లు లేదా ఆఫీస్ కోసం కొత్త LED టీవీని కూడా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్‌లో టీవీ మోడళ్లపై అందుబాటులో ఉన్న ఉత్తమ డీల్‌ల గురించి తెలుసుకుందాం.

అమెజాన్ సేల్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 43-అంగుళాల మోడళ్లపై అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ డీల్‌ల గురించి తెలుసుకుందాం. ప్రోడక్ట్‌ తగ్గింపుతో పాటు, కొత్త టీవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ప్రయోజనాలతో కూడా అందుబాటులో ఉంది.

Motorola EnvisionX 43 అంగుళాల QLED TV

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ మోటరోలా టీవీని 59 శాతం తగ్గింపు తర్వాత రూ. 20 వేల 999కి విక్రయిస్తున్నారు. ఈ టీవీలో డాల్బీ విజన్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, 20 వాట్ సౌండ్ అవుట్‌పుట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉంటాయి.

Smart Tv1

Hisense 43 అంగుళాల Google TV:

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 43 అంగుళాల స్క్రీన్ పరిమాణంతో ఈ స్మార్ట్ టీవీని 42 శాతం తగ్గింపు తర్వాత రూ. 19 వేల 999కి విక్రయిస్తున్నారు. ముఖ్యమైన ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఈ టీవీలో 30 వాట్ పవర్‌ఫుల్ సౌండ్, డాల్బీ ఆడియో, హెచ్‌డిఆర్ 10, ఫుల్ హెచ్‌డి రిజల్యూషన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్‌లకు సపోర్ట్ ఉంది. మీరు ఈ టీవీని అమెజాన్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.

Smart Tv2

థామ్సన్ ఫీనిక్స్ 43 అంగుళాల స్మార్ట్ టీవీ:

ఈ థామ్సన్ టీవీ 43 అంగుళాల స్క్రీన్ పరిమాణంతో 35 శాతం తగ్గింపుతో లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత ఈ టీవీని రూ.20,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ అల్ట్రా HD (4K) రిజల్యూషన్, 40 వాట్ సౌండ్ అవుట్‌పుట్, 60 Hz రిఫ్రెష్ రేట్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రయోజనాలు ఉంటాయి. Google TV ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన ఈ థామ్సన్ టీవీలో మీరు స్పోర్ట్స్, గేమ్, వివిడ్, మూవీ వంటి వీడియో మోడ్‌లను పొందవచ్చు. 550 nits పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో ఈ స్మార్ట్ టీవీ 2 GB RAMతో 16 GB స్టోరేజ్‌ని కలిగి ఉంటుంది.

Smart Tv3

Coocaa 43 అంగుళాల టీవీ ధర:

43 అంగుళాల స్క్రీన్ సైజు ఉన్న ఈ టీవీని ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఈ టీవీలో డాల్బీ ఆడియో, ఐ కేర్ టెక్నాలజీ, 20 వాట్ సౌండ్ అవుట్‌పుట్, ఫుల్ హెచ్‌డి రిజల్యూషన్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ యాప్‌లకు సపోర్ట్ ఉంటుంది.

Smart Tv4

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి