Rakesh Jhunjhunwala: ఆ కంపెనీలో వాటాలు పెంచుకున్న బిగ్ బుల్.. ఇన్వెస్టర్లకు ఏడాదిలో 70 శాతం రిటర్న్ ఇచ్చిన స్టాక్..
Rakesh Jhunjhunwala: రాకేశ్ జున్‌జున్‌వాలా స్టాక్ మార్కెట్లో ఆయన ఏదైనా షేర్ కొన్నారంటే దానికి ఒక లెక్క ఉంటది. కారణం లేకుండా బిగ్ బుల్ ఏమీ చేయరద్దని అనేక మంది నమ్మకం. తాజాగా ఆయన ఆ కంపెనీలో కొత్తగా మరో 65 లక్షల షేర్లను కొన్నారు.
Rakesh Jhunjhunwala: రాకేశ్ జున్‌జున్‌వాలా స్టాక్ మార్కెట్లో ఆయన ఏదైనా షేర్ కొన్నారంటే దానికి ఒక లెక్క ఉంటది. కారణం లేకుండా బిగ్ బుల్ ఏమీ చేయరద్దని అనేక మంది నమ్మకం. తాజాగా ఆయన బ్యాంకింగ్ రంగానికి(Banking Sector) చెందిన స్టాక్ లో పెట్టుబడి పెట్టారు. అది కూడా ప్రభుత్వ రంగ బ్యాంక్ లో అంటే మామూలు మాటలు కాదు. తన పోర్టుఫోలియోలో సదరు బ్యాంకు స్టాక్స్ ను ఆయన పెంచేసుకున్నారు. ఆయన పోర్ట్‌ఫోలియోను(Portfolio) ఫాలో అవుతూ పెట్టుబడులు పెట్టేవారు అనేక మందే ఉంటారు.
తాజాగా.. మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్‌లో రాకేశ్ జున్‌జున్‌వాలా తన వాటాను పెంచుకున్నారు. ఇప్పుడు బ్యాంకులో ఆయనకు 1.96 శాతం వాటా ఉంది. అంటే డిసెంబర్ త్రైమాసికం కంటే ఇది 0.36 శాతం ఎక్కువ. Q4FY22కి కంపెనీ BSEలో ఇచ్చిన షేర్‌హోల్డింగ్ సమాచారం ప్రకారం.. రాకేశ్ జున్‌జున్‌వాలా తన పోర్ట్‌ఫోలియోలో కెనరా బ్యాంక్‌లో 3,55,97,400 షేర్లను కలిగి ఉన్నారు. వీటి ప్రస్తుత విలువ రూ.884 కోట్లుగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో ఆయన పోర్ట్‌ఫోలియోలో బ్యాంక్ 29,097,400 షేర్లను కలిగి ఉన్నారు. అంటే జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో కొత్తగా 65 లక్షల బ్యాంకు షేర్లను కొనుగోలు చేశారు. ఈ షేర్ గత సంవత్సర కాలంలో మల్టీబ్యాగర్ స్టాక్‌గా మారి.. ఇన్వెస్టర్లకు 70 శాతం రాబడిని ఇచ్చింది. అదే కేవలం ఈ సంవత్సరం ఇప్పటి వరకు స్టాక్ 20 శాతం రాబడిని తెచ్చిపెట్టింది.
2022 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో, PSU రంగానికి చెందిన కెనరా బ్యాంక్ అద్భుతమైన ఫలితాలను అందించింది. డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ లాభం ఏడాది ప్రాతిపదికన దాదాపు 115 శాతం పెరిగి రూ.1502 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో, డిసెంబర్ త్రైమాసికంలో కెనరా బ్యాంక్ వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 14.1 శాతం పెరిగి రూ.6945 కోట్లకు చేరుకుంది. త్రైమాసిక ప్రాతిపదికన బ్యాంక్.. ప్రొవిజెన్స్ రూ.3,360 కోట్ల నుంచి రూ.2,245 కోట్లకు తగ్గాయి. బ్యాంకు రుణ వృద్ధి రేటు వార్షిక ప్రాతిపదికన 9.1 శాతం పెరిగింది. బ్యాంకు ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తి 82.44 శాతం నుంచి 83.26 శాతానికి పెరిగింది. మూడవ త్రైమాసికంలో బ్యాంక్ ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. త్రైమాసిక ప్రాతిపదికన బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 8.42 శాతం నుంచి 7.80 శాతానికి తగ్గాయి. అదే సమయంలో ఈ కాలంలో నికర ఎన్‌పీఏ 3.21 శాతం నుంచి 2.86 శాతానికి తగ్గింది.
ఇవీ చదవండి..
Google: గూగుల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకి 9 రోజులు ఆఫీస్‌కి వచ్చే వారికి ఆ సర్వీస్ ఫ్రీ..