Railway Premium Tatkal Scheme: ఇండియన్ రైల్వే శాఖ ప్రయాణికుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రానున్న రోజుల్లో అన్ని రైళ్లలో ప్రీమియం తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టవచ్చని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. ఈ పథకం ప్రీమియం తత్కాల్ కోటా కింద రైలులో కొన్ని సీట్లను రిజర్వ్ చేయనుంది. వీటిని డైనమిక్ ఛార్జీల ధరలపై బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే చివరి నిమిషంలో రైలు టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు ఈ కోటా సౌకర్యం కల్పిస్తుంది. ప్రీమియం తత్కాల్ కోటా కింద టికెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణికులు కొంత అదనపు ఛార్జీలను చెల్లించుకోవాల్సి ఉంటుంది. పథకం కింద ఉన్న ఛార్జీలో ప్రాథమిక రైలు ఛార్జీలు, అదనపు తత్కాల్ ఛార్జీలు ఉంటాయి. అయితే గతంలో కరోనా మహమ్మారి కారణంగా వృద్దులకు ఈ సదుపాయం ఎత్తివేసింది.
ప్రస్తుతం ప్రీమియం తత్కాల్ బుకింగ్ ఎంపిక దాదాపు 80 రైళ్లకు అందుబాటులో ఉంది. అన్ని రైళ్లలో కోటాను అమలు చేస్తే రైల్వేశాఖకు మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అందుకే రానున్న రోజుల్లో అన్ని రైళ్లకు వర్తించేలా చర్యలు చేపడుతోంది రైల్వే శాఖ. 2020-21లో తత్కాల్, ప్రీమియం తత్కాల్ బుకింగ్ ద్వారా రైల్వేశాఖకు రూ.500 కోట్లకుపైగా ఆదాయం సమకూరిందని నివేదికలు చెబుతున్నాయి.
కోవిడ్ మహమ్మారి సమయం 2020లో ఉపసంహరించిన సీనియర్ సిటిజన్‌ల ఛార్జీల రాయితీలను కూడా మళ్లీ పునరుద్దరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో రాయితీ సదుపాయాన్ని నిలిపివేయడంతో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో మళ్లీ పునరుద్దరించే అవకాశాలున్నాయి. ఇందులో మహిళలకు అంతకు ముందు 58 సంవత్సరాలు, మహిళలకు 60 సంవత్సరాల వయసు ఉండగా, దానిని 70 ఏళ్లకు పొడిగించింది. ఇంకా సీనియర్ సిటిజన్ రాయితీని జనరల్, స్లీపర్ క్లాస్ టికెట్ల నాన్ ఏసీ తరగతులకు మాత్రమే పునరుద్దరించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి