Gas Cylinder: రూల్స్ మారనున్నాయ్.. ఇకపై గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. పూర్తి వివరాలు

|

Jul 05, 2024 | 8:55 PM

ఎల్‌పీజీ సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్‌ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. గ్యాస్‌ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్‌ల ట్రాకింగ్ కోసం, ఏజెన్సీల ఇన్‌వెంటరీ నిర్వహణకు..

Gas Cylinder: రూల్స్ మారనున్నాయ్.. ఇకపై గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. పూర్తి వివరాలు
Gas Cylinder
Follow us on

ఎల్‌పీజీ సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్‌ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. గ్యాస్‌ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్‌ల ట్రాకింగ్ కోసం, ఏజెన్సీల ఇన్‌వెంటరీ నిర్వహణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.

గ్యాస్‌ సిలిండర్ల క్యూఆర్ కోడ్ ముసాయిదాను గ్యాస్ సిలిండర్ రూల్స్ జీసీఆర్‌లో పొందుపరిచినట్లు మంత్రి చెప్పారు. త్వరలో దీనిపై తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందనీ గ్యాస్‌ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్‌ల ట్రాకింగ్ కోసం ఈ క్యూఆర్‌ కోడ్‌ ఎంతో ఉపయోగపడుతుందని గోయల్ అన్నారు.

నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్‌ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని మంత్రి పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ పెసో ను ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సీపీసీబీ మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం – డీపీఐఐటీ కింద పని చేసే పెసో, 1884 ఎక్స్‌ప్లోజివ్స్‌ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పెసో మంజూరు చేసిన లైసెన్సింగ్‌ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80 శాతం, ఎంఎస్‌ఎంఈలకు 50 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్లు మంత్రి వివరించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: తిరుగుండదు ఈ బిజినెస్‌కి.. ప్రతీ నెలా రూ. 50 వేలు పక్కా.. అదేంటంటే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..