నేటి కాలంలో ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. బ్యాంకు పని అయినా, భూమి రిజిస్ట్రేషన్ అయినా ఎక్కడైనా ఆధార్ కార్డు తప్పనిసరి. ఎక్కడికో అడ్మిషన్ తీసుకోవాలన్నా, ట్రిప్ వెళ్లాలన్నా ఆధార్ లేకుండా పనులు జరగవు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేస్తుంది. ఇది పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) కార్డు రూపంలో ఆధార్‌ను పొందవచ్చు.
PVC ఆధార్ కార్డ్ సురక్షితమైనది:
ఇప్పటి వరకు ఆధార్‌ను పేపర్‌పై ప్రింటెడ్ రూపంలో వచ్చేది. దానిని ల్యామినేషన్ చేసుకునేవారు. అయితే, PVC ఆధార్ కార్డును జీవితకాలం పాటు నిర్వహించడం చాలా సులభం. ఏటీఎం తరహాలో ఉండే ఈ కార్డును మీ వాలెట్‌లో ఉంచుకోవడమే అతిపెద్ద విషయం. సింథటిక్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఈ కార్డ్ పరిమాణం 86 MM X 54 MM. ఈ కార్డు నాణ్యతతో కూడి ఉంటుంది. దృఢంగా ఉండటమే కాకుండా, ఇది హోలోగ్రామ్, గిల్లోచే ప్యాటర్న్, QR కోడ్ వంటి అన్ని భద్రతా నమూనాలను కలిగి ఉంది.
ఈ విధంగా PVC కార్డును ఆర్డర్ చేయండి
You may order the #Aadhaar #PVC card, which is durable, attractive, and has the latest security features like: Hologram, Guilloche Pattern, etc.
To order, click: https://t.co/sPehG6bzAA pic.twitter.com/csEEiLG3Yq
— Aadhaar (@UIDAI) January 6, 2025
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి