AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..

Property Rights: తల్లిదండ్రుల ఆస్తిలో పిల్లలందరికీ సమాన హక్కు ఉంటుందన్న విషయం తెలిసిందే. మరి కొడుకు సంపాదించిన ఆస్తిపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు ఉంటాయి? ఒకవేళ కొడుకు అకాల మరణం చెందితే ఆస్తి మొత్తం భార్యకే దక్కుతుందా లేక తల్లిదండ్రులకు కూడా వాటా వస్తుందా? హిందూ వారసత్వ చట్టం ప్రకారం కొడుకు ఆస్తిలో ఎవరికి ఎంత వాటా ఉంటుందో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.

కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..
Do Parents Have Rights In Son Property
Krishna S
|

Updated on: Oct 04, 2026 | 3:23 PM

Share

తల్లిదండ్రుల సంపాదన లేదా వారసత్వ ఆస్తిలో పిల్లలందరికీ సమాన హక్కులు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ అది సొంత సంపాదన అయితే.. తల్లిదండ్రులు తమ ఇష్టానుసారం ఎవరికైనా వీలునామా రాసి ఇవ్వవచ్చు. కానీ కొడుకు సంపాదించిన ఆస్తి విషయంలో చట్టం ఏం చెబుతోంది? కొడుకు ఆస్తిలో తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా? లేక మొత్తం ఆస్తి భార్య, పిల్లలకే దక్కుతుందా? అనే విషయాలు చాలా మందికి తెలియవు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. ఒక పురుషుడు ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే.. అతని ఆస్తి మొదట క్లాస్-1 చట్టబద్ధ వారసులు అంటే భార్య, పిల్లలు, తల్లికి చెందుతుంది. మరణించిన వ్యక్తి వీలునామా రాయకపోతే అతని ఆస్తి ఈ క్లాస్-1 వారసులందరికీ సమాన వాటాలుగా పంపిణీ అవుతుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తికి భార్య, ఒక బిడ్డ, తల్లి ఉంటే ఆస్తి మూడు సమాన భాగాలుగా విభజించబడుతుంది.

తండ్రికి వాటా ఎప్పుడు దక్కుతుంది?

చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం.. కొడుకు ఆస్తికి సంబంధించి తల్లి క్లాస్-1 వారసురాలు కాగా తండ్రిని క్లాస్-2 వారసుడిగా పరిగణిస్తారు. తల్లికి భార్యాపిల్లలతో పాటు ప్రాథమికంగానే సమాన వాటా పొందే చట్టబద్ధ హక్కు ఉంటుంది. క్లాస్-1 వారసులు ఎవరూ లేని పక్షంలోనే ఆస్తి క్లాస్-2 వారసుడైన తండ్రికి లేదా ఇతర బంధువులకు చేరుతుంది.

వివాహితులు, అవివాహితుల విషయంలో నిబంధనలు

వ్యక్తి వైవాహిక స్థితిని బట్టి ఆస్తి బదిలీ నియమాలు మారుతాయి..

అవివాహితుడైన పురుషుడు మరణిస్తే: ఆస్తిపై మొదటి హక్కు తల్లికే దక్కుతుంది. తల్లి జీవించి లేకపోతే, అప్పుడు ఆస్తి తండ్రికి, ఆపై ఇతర క్లాస్-2 వారసులకు చెందుతుంది.

పెళ్లైన వ్యక్తి మరణిస్తే: భార్య క్లాస్-1 వారసురాలిగా పరిగణించబడుతుంది. అయితే ఆస్తి మొత్తం ఆమెకే చెందదు. మరణించిన వ్యక్తి తల్లి, పిల్లలతో కలిసి ఆమె సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది.

మహిళ మరణించిన సందర్భంలో: ఒక స్త్రీ వీలునామా లేకుండా మరణిస్తే, ఆమె ఆస్తి మొదట ఆమె పిల్లలకు, భర్తకు చెందుతుంది. వారు లేని పక్షంలో భర్త తరఫు వారసులకు.. ఆ తర్వాతే ఆమె తల్లిదండ్రులకు దక్కుతుంది.

క్లాస్-1, క్లాస్-2 వారసులు అంటే ఎవరు?

  • క్లాస్-1 : కుమారుడు, కుమార్తె, భార్య, తల్లి.
  • క్లాస్-2: తండ్రి, సోదరులు, సోదరీమణులు, వారి పిల్లలు, ఇతర దగ్గరి రక్తసంబంధీకులు.

కుటుంబాల్లో భవిష్యత్తులో వచ్చే ఆస్తి తగాదాలను, న్యాయపరమైన చిక్కులను నివారించడానికి జీవించి ఉన్నప్పుడే చట్టబద్ధంగా వీలునామా రాసుకోవడం ఉత్తమ మార్గమని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. నిర్దిష్ట పరిస్థితులు, ప్రాంతీయ ఆచారాలను బట్టి చట్టపరమైన అంశాల్లో మార్పులు ఉండవచ్చని, పూర్తి వివరాలకు లీగల్ నిపుణులను సంప్రదించాలని స్పష్టం చేస్తున్నారు.

Follow Us
కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా..?
కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా..?
మూడేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ తిరిగా..
మూడేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ తిరిగా..
వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?
వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?
రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్.. ఇలాంటి ఆఫర్ ఎక్కడా ఉండదు.
రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్.. ఇలాంటి ఆఫర్ ఎక్కడా ఉండదు.
విశ్వక్‌సేన్ 'కల్ట్' షూటింగ్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?
విశ్వక్‌సేన్ 'కల్ట్' షూటింగ్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?
అదృష్టం అంటే ఇదే! రూ.2,800 పెయింటింగ్‌కు వేలంలో రూ.13 కోట్ల ధర!
అదృష్టం అంటే ఇదే! రూ.2,800 పెయింటింగ్‌కు వేలంలో రూ.13 కోట్ల ధర!
చివరి చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం
చివరి చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం
భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!
భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!
లక్కంటే బుమ్రా, దూబేదే..ఫైనల్ వస్తే చాలు వీరు కప్పు కొట్టాల్సిందే
లక్కంటే బుమ్రా, దూబేదే..ఫైనల్ వస్తే చాలు వీరు కప్పు కొట్టాల్సిందే
దసరా సెలవుల్లో జాలీగా.. తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రదేశాలివే
దసరా సెలవుల్లో జాలీగా.. తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రదేశాలివే