LIC Plan: ఎల్‌ఐసీలో అద్భుతమైన ప్లాన్‌.. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10 వేల వరకు పెన్షన్‌ తీసుకోవచ్చు.. ఎలాగంటే

LIC Plan: లైఫ్‌ ఇన్స్‌రెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) సీనియర్‌ సిటిజన్స్‌ కోసం ఓ కొత్త పథకం అందుబాటులో ఉంది. ప్రధాన మంత్రి వయ వందన యోజన (LIC PMVVY Scheme)లో చేరిన వారికి..

LIC Plan: ఎల్‌ఐసీలో అద్భుతమైన ప్లాన్‌.. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10 వేల వరకు పెన్షన్‌ తీసుకోవచ్చు.. ఎలాగంటే
Follow us
Subhash Goud

|

Updated on: May 22, 2021 | 2:56 PM

LIC Plan: లైఫ్‌ ఇన్స్‌రెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) సీనియర్‌ సిటిజన్స్‌ కోసం ఓ కొత్త పథకం అందుబాటులో ఉంది. ప్రధాన మంత్రి వయ వందన యోజన (LIC PMVVY Scheme)లో చేరిన వారికి 7.4 శాతం వడ్డీని సైతం అందిస్తుంది. ఈ పథకం గత ఏడాది మార్చి నెలతో ఈ స్కీమ్ గడువు ముగిసింది. వృద్ధులకు ఆసరాగా నిలిచేందుకు, వారికి ప్రతినెలా ప్రయోజనం కల్పించేందుకుగానూ స్కీమ్‌లో చేరే తుది గడువును 31 మార్చి 2023 వరకు పొడిగించారు.

పాలసీ గడువు మూడేళ్లు ముగిసిన తర్వాత..

కాగా, పాలసీ గడువు మూడేళ్లు ముగిసిన తర్వాత ఎల్‌ఐసీ పాలసీదారులు రుణాలు కూడా తీసుకునేందుకు వీలుంటుంది. ప్రధాన మంత్రి వయ వందన యోజనలో చేరాలంటే సీనియర్‌ సిటిజన్స్‌కు కనీస వయసు 60 ఏళ్లు ఉండాలి.

అయితే వృద్ధాప్యంలో పెన్షన్‌ ద్వారా అసరా పొందాలనుకునే వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించిన ఈ పెన్షన్‌ స్కీమ్‌ ప్రధాన మంత్రి వయ వందన. ప్రస్తుతం ఉన్న పొదుపు పథకాలతో పోలిస్తే ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్‌లోనే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టి నెలకు రూ.1000 నుంచి రూ.10,000 మధ్య పెన్షన్‌ పొందవచ్చు. రూ. 10 వేలు కావాలంటే రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. ఇన్వెస్ట్‌ చేసిన వాటి నుంచి పదేళ్ల వరకు పెన్షన్‌ లభిస్తుంది. పదేళ్లు పూర్తయిన తర్వాత పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుంది. ఈ స్కీమ్‌లో చేరడానికి కనీస వయసు 60 ఏళ్లు కాగా, గరిష్ట పరిమితి లేదు. పదేళ్ల వరకు నెలకు రూ.10,000 చొప్పున పెన్షన్‌ లభిస్తుంది. పదేళ్లు పూర్తయిన తర్వాత మొదట పెట్టిన పెట్టుబడి రూ.15,00,000 తిరిగి ఇచ్చేస్తారు. ఈ స్కీమ్‌ ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌ లైన్‌లో తీసుకోవచ్చు. పాలసీ తీసుకోవాలంటే ఆధార్‌ నెంబర్‌ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది.

పాలసీ గడువు 10 ఏళ్లు మాత్రమే. కనీస పెన్షన్ నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 వస్తాయి. గరిష్ట పెన్షన్ నెలకు రూ.10,000, మూడు నెలలకు రూ.30,000, ఆరు నెలలకు రూ.60,000, ఏడాదికి రూ.1,20,000 వస్తాయి. అయితే ఎన్ని నెలలకు ఓసారి పెన్షన్ తీసుకోవాలో అనే అంశాన్ని ముందే వెల్లడించాల్సి ఉంటుంది. పాలసీ మూడేళ్లు పూర్తయిన తర్వాత గరిష్టంగా 75% రుణం తీసుకోవచ్చు. ఏడాదికి వడ్డీ 10% చెల్లించాలి. 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98% మాత్రమే వెనక్కి వస్తుంది. ఒకవేళ 10 ఏళ్లు పూర్తి కాకముందే పెట్టుబడి పెట్టిన వ్యక్తి చనిపోతే రూ.15,00,000 వారి జీవితభాగస్వామి లేదా పిల్లలు లేదా నామినీకి వస్తాయి.

ఇవీ కూడా చదవండి:

Bank Charges: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు ఏవో తెలుసుకోండి..!

SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. 3 రోజులు ఆ సర్వీసులన్నీ బంద్.. ఎందుకో తెలుసా..?