Insurance: కేవలం రూ.20 డిపాజిట్‌తో రూ.2 లక్షల బీమా సౌకర్యం.. ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా?
Insurance: ఆరోగ్య పాలసీ లేదా వైద్య నిధిని పొందలేని వారికి సంవత్సరానికి రూ.20 బీమా కవర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన వారు లేదా అసంఘటిత రంగంలో పనిచేసే వారు ఈ పథకం ద్వారా తమను తాము, వారి కుటుంబాలను రక్షించుకోవచ్చు..

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చుల మధ్య ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొవడం అందరికి సాధ్యం కాకపోవచ్చు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తిన సమయంలో వైద్య ఖర్చులను భరించడం సవాలుతో కూడుకున్నది. రూ. 20 చిన్న పెట్టుబడి మీకు రూ. 2 లక్షల బీమా రక్షణను అందిస్తుంది. ప్రభుత్వం అటువంటి పథకాన్ని తీసుకువచ్చింది. అదే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). దీనిలో మీరు కేవలం రూ. 20 వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా రక్షణ పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Viral Video: ఇది చూస్తే వణుకు పుట్టాల్సిందే.. భయానక వీడియో వైరల్
ప్రభుత్వ పథకాన్ని ఎవరు సద్వినియోగం చేసుకోవచ్చు?
మీ వయస్సు 18 -70 సంవత్సరాల మధ్య ఉంటే, మీకు ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా ఉంటే మీరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం కింద బీమా కవర్ ప్రతి సంవత్సరం పునరుద్ధరిస్తూ ఉండాలి. ఈ పథకం రూ. 20లు మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేసి ఉంటే ప్రతి సంవత్సరం అటోమెటిక్‌గా డెబిట్ అవుతుంది.
ఇందులో ఏం కవర్ అవుతాయి?
ఈ బీమా పథకం ప్రమాదవశాత్తు జరిగిన కేసులపై మాత్రమే దృష్టి పెడుతుంది. ఒక వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే లేదా పూర్తిగా వికలాంగులైతే అతనికి లేదా అతని కుటుంబానికి రూ. 2 లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. మరోవైపు ఆ వ్యక్తి పాక్షికంగా వికలాంగులైతే అతనికి రూ. 1 లక్ష వరకు క్లెయిమ్ అందిస్తుంది. అయితే ఈ పథకం సహజ మరణం లేదా అనారోగ్యం సందర్భాలలో ప్రయోజనాలను అందించదు.
ఇది కూడా చదవండి: Minimum Balance: కస్టమర్లకు పండగలాంటి వార్త చెప్పిన మరో బ్యాంకు.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ రద్దు
ఎలా దరఖాస్తు చేయాలి?
ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి ముందుగా మీరు మీ బ్యాంకు శాఖను సంప్రదించాలి. PMSBY ఆ బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే మీరు ముందుగా మీ బ్యాంకు శాఖకు వెళ్లాలి. అక్కడ మీకు పథకానికి సంబంధించిన ఫారమ్ లభిస్తుంది. దానిని పూరించి పత్రాలతో పాటు బ్యాంకులో సమర్పించండి.
ఈ ప్రణాళిక ఎందుకు అవసరం?
ఆరోగ్య పాలసీ లేదా వైద్య నిధిని పొందలేని వారికి సంవత్సరానికి రూ.20 బీమా కవర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన వారు లేదా అసంఘటిత రంగంలో పనిచేసే వారు ఈ పథకం ద్వారా తమను తాము, వారి కుటుంబాలను రక్షించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: White Bedsheets: పెద్ద కథే.. హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లనే ఎందుకు వేస్తారో తెలుసా? కారణం ఇదే!
ఇది కూడా చదవండి Gold Price: మహిళలకు బ్యాడ్‌న్యూస్.. కొన్ని గంటల్లోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








