Pension Scheme: ఈ పథకంలో చేరితే నెలకు రూ.3 వేల పెన్షన్‌ పొందవచ్చు.. పూర్తి వివరాలు..!

| Edited By: Ravi Kiran

Dec 09, 2021 | 6:20 AM

Pension Scheme: కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలను ప్రవేశపెడుతుంది. అందులో పెన్షన్‌కు సంబంధించిన పథకాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులకు, చిన్నచిన్న..

Pension Scheme: ఈ పథకంలో చేరితే నెలకు రూ.3 వేల పెన్షన్‌ పొందవచ్చు.. పూర్తి వివరాలు..!
Follow us on

Pension Scheme: కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలను ప్రవేశపెడుతుంది. అందులో పెన్షన్‌కు సంబంధించిన పథకాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులకు, చిన్నచిన్న కార్మికులకు మేలు జరిగే పథకాలను ప్రవేశపెడుతోంది మోదీ సర్కార్‌. వారికి వయసు మీద పడిన తర్వాత వారికి ఆర్థికంగాఅండగా ఉండేందుకు పలు పెన్షన్‌ పథకాలను ప్రవేశపెడుతున్నారు. అసంఘటిత రంగాల వారికి పెన్షన్‌లు ఇచ్చేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2019లో ‘ప్రధానమంత్రి శ్రమ్‌ యోగి మన్‌ధన్‌ యోజన’ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ పెన్షన్‌ పథకంలో చేరితే చందాదారుడికి 60 ఏళ్లు వచ్చిన తర్వాత నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్‌ పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో చూద్దాం.

ఎవరెవరు అర్హులు..

అయితే అసంఘటిత రంగాలలో పని చేస్తూ నెలకు రూ.15వేల కంటే తక్కువ వేతనం తీసుకుంటున్న వాళ్లు ఈ ప్రధానమంత్రి శ్రమ్‌ యోగి మన్‌ధన్‌ యోజన పథకానికి అర్హులు. 18 నుంచి 40 సంవ‌త్సరాల వ‌య‌సు క‌లిగినవారు ఈ పెన్షన్‌ పథకానికి పేరు న‌మోదు చేసుకోవ‌చ్చు. ఇది స్వచ్ఛంద పెన్షన్ ప‌థ‌కం. దీని ద్వారా వచ్చే ఆదాయంపై ఎలాంటి ఆదాయ ప‌న్ను వ‌ర్తించ‌దు. 50:50 నిష్పత్తిలో చందాదారుడు ఎంత జ‌మ‌ చేస్తే, అంతే స‌మానంగా కేంద్ర ప్రభుత్వం జ‌మ‌ చేస్తుంది. ఈ స్కీమ్‌ కింద చందాదారుడికి 60 సంవత్సరాలు వచ్చాక నెలకు రూ. 3వేల చొప్పున పెన్షన్‌ అందుకుంటాడు. ఒక వేళ 60 ఏళ్ల కంటే ముందే ఏదైనా కారణాలతో మ‌ర‌ణిస్తే వారి భార్య లేదా భ‌ర్త ఈ ప‌థ‌కాన్ని కొన‌సాగించవచ్చు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా సుమారు 45 లక్షలకుపైగా మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

ఈ స్కీమ్‌లో పేరు ఎలా న‌మోదు చేసుకోవాలి..?

అర్హత ఉన్న చందాదారులు కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌ (సీఎస్‌సీ)లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ సెంట‌ర్ల జాబితా ఎల్ఐసీ ఇండియా శాఖల్లో లభిస్తుంది. ఈ పెన్షన్‌ ప‌థ‌కాన్ని ప్రారంభించేందుకు పొదుపు బ్యాంకు ఖాతా/ జ‌న్ ధ‌న్ ఖాతా, ఆధార్ కార్డు ఉండాలి.

ఎలాంటి నియమాలు..

పెన్షన్‌ పొందేందుకు చందాదారుడు ఈ స్కీమ్‌లో చేరిన తర్వాత ఐదు సంవత్సరాల ముందే స్కీమ్‌ నుంచి వెళ్లిపోతే చందాదారుడు జ‌మ‌ చేసిన మొత్తానికి బ్యాంకు వ‌డ్డీతో క‌లిపి చెల్లిస్తారు. పది సంవత్సరాల తర్వాత 60 ఏళ్లకు ముందే ఉప‌సంహ‌రించుకుంటే ఫండ్ ద్వారా సంపాదించిన వడ్డీ లేదా పొదుపు బ్యాంకు వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. దాంతో పాటు, లబ్ధిదారుడి వాటా కూడా తిరిగి ల‌భిస్తుంది.

ఎంత జమ చేయాలి:

18 ఏళ్ల వయసులో ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.55 జమ చేయాల్సి ఉంటుంది. అంతే మొత్తం ప్రభుత్వం జమ చేస్తుంది. వ‌య‌సు పెరిగిన కొద్దీ కాంట్రిబ్యూష‌న్ మొత్తం పెరుగుతూ వ‌స్తుంది. మొద‌టి నెల చెల్లింపు న‌గ‌దు రూపంలో ఇస్తే.. వారికి ర‌శీదు ఇస్తారు. దాంతోపాటు ప్రత్యేక ఐడీ నంబ‌ర్లు ఉన్న కార్డులను కూడా సీఎస్‌సీలు వినియోగదారులకు అందిస్తాయి. అలాగే https://maandhan.in/shramyogi వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా పేరు నమోదు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Rs 2000 Notes: క్రమంగా తగ్గిపోతున్న 2000 రూపాయల నోట్ల చలామణి.. నిలిచిపోయిన ముద్రణ.. నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ

Digital Payments: దేశ ప్రజలకు షాక్ ఇవ్వనున్న ఆర్‌బీఐ.. ఆ చెల్లింపులపై ‘ఛార్జీల వడ్డన’కు రంగం సిద్ధం..!