AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF: పీపీఎఫ్ ఖాతాను ఎన్నిసార్లు పొడిగించుకోవచ్చు..? ఇలా చేస్తే మీకు లాభమే..

పీపీఎఫ్. దేశంలో ఎక్కువగా వినిపించే కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకాల్లో ఇది ఒకటి. ఎక్కువమంది ఇందులో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇందులో పెట్టే పెట్టుబడులకు పూర్తిగా పన్ను రహితం. మీరు విత్ డ్రా చేసుకునే డబ్బులపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

PPF: పీపీఎఫ్ ఖాతాను ఎన్నిసార్లు పొడిగించుకోవచ్చు..? ఇలా చేస్తే మీకు లాభమే..
Money
Venkatrao Lella
|

Updated on: May 03, 2026 | 9:19 AM

Share

దేశంలో అత్యంత పాపులర్ అయిన కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి పథకంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పేరు పొందింది. 15 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ దీనికి ఉంటుంది. మెచ్యూరిటీ కాలం పూర్తయ్యే వరకు పెట్టుబడి పెట్టడంతో పాటు ఆ తర్వాతనే తీసుకునే అవకాశం ఉంటుంది. మధ్యలో అత్యవసరమైతే కొన్ని కారణాలు చూపించి తీసుకోవచ్చు. అయితే 15 సంవత్సరాల కాల పరిమితి తర్వాత వడ్డీతో సహా సొమ్ము మొత్తం తీసుకోవచ్చు. లేదా అకౌంట్‌ను మీరు కొనసాగించవచ్చు. ఐదేళ్ల పాటు మీరు పెట్టుబడి కాలాన్ని పొడిగించుకోవచ్చు. ఇలా వద్దనుకుంటే.. ఎలాంటి అదనపు డిపాజిట్ చేయకుండానే అకౌంట్‌ను కొనసాగించుకోవచ్చు. ఇది ఎలా అనేది ఒకసారి చూద్దాం.

15 ఏళ్ల తర్వాత ఏం చేయాలి..?

15 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ తర్వాత పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ అవుతుంది. వడ్డీతో సహా మొత్తం జమ అయిన నగదును విత్ డ్రా చేసుకుని అకౌంట్‌ను క్లోజ్ చేయవచ్చు. మీరు విత్ డ్రా చేసుకునే సొమ్ము, వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు. ఇది పూర్తిగా పన్ను రహితమని చెప్పవచ్చు. ఇక పీపీఎఫ్ వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రకటిస్తూ ఉంటుంది. వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం 7.01 శాతం వార్షిక వడ్డీ రేటు కొనసాగుతోంది. ప్రతీ నెలా 5వ తేదీ నుంచి చివరి తేదీ మధ్య ఉన్న అత్యల్ప నిల్వపై వడ్డీని లెక్కించి ఆర్ధిక సంవత్సరం చివరిలో అకౌంట్లో జమ చేస్తారు.

ఈ మార్గాలతో పెంచుకోవచ్చు

ఇక 15 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ అయిన తర్వాత మీరు ఐదేళ్ల పాటు కాలపరిమితిని పెంచుకోవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. మీరు ఎన్నిసార్లు అయినా ఈ పీరియడ్ పెంచుకునే అవకాశముంది. ప్రతీ ఏడాది రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ ఉండదు. ఇక డిపాజిట్‌పై పన్ను రహిత వడ్డీని పొందటాన్ని కొనసాగించవచ్చు. దీని వల్ల కొన్ని పన్ను ప్రయోజనాలు ఉండవు. ఇక 15 ఏళ్ల తర్వాత పొడిగించుకుంటే 5 ఏళ్లల్లో బ్యాలెన్స్‌లో 60 శాతం వరకు మాత్రమే విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో ఒకసారి మాత్రమే విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. తక్షణమే డబ్బులు అవసరం లేకపోయినా, పన్ను రహిత వడ్డీ కొనసాగించాలని అనుకుంటే గడువు పొడిగించుకోవచ్చు. నగదు అవసరం అనుకున్నా లేదా ఆ నగదును స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టాలనుకుంటే విత్ డ్రా అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక ఐదేళ్ల తర్వాత పీపీఎఫ్ అకౌంట్‌ను గడువుకు ముందే మూసివేసే సదుపాయం ఉంది. కానీ వడ్డీ రేటు 1 శాతం తగ్గిస్తారు.

Follow Us