Telugu News Business Post Office RD Scheme: Earn Rs 4.40 Lakh only through Interest; Build a corpus of Rs 15 Lakh with just Rs 300 daily savings
Best Scheme: కేవలం వడ్డీతోనే రూ. 4.40 లక్షల లాభం.. రోజుకు రూ. 300 పొదుపుతో రూ. 15 లక్షల ఫండ్!
Best Scheme: ప్రతి వ్యక్తి తాను కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేస్తాడు. అయితే, ఈ ద్రవ్యోల్బణ కాలంలో కేవలం డబ్బు ఆదా చేయడం మాత్రమే సరిపోదు. దానిని సరైన, సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టడం కూడా అంతే..
Post Office RD Scheme: సామాన్యుల పొదుపు కోసం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పథకాలు ఎప్పుడూ భరోసానిస్తాయి. ప్రభుత్వ గ్యారెంటీ ఉండటంతో ఇందులో రిస్క్ సున్నా, లాభం మాత్రం ధీమాగా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన పథకమే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD). ఈ స్కీమ్ ద్వారా మీ చిన్న చిన్న పొదుపులు కొన్నేళ్లలో భారీ నిధిగా ఎలా మారుతాయో ఇప్పుడు చూద్దాం.
లోన్ సదుపాయం: ఖాతా తెరిచిన ఏడాది తర్వాత మీ డిపాజిట్ మొత్తంలో 50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. దీనిపై వడ్డీ రేటు చాలా తక్కువగా (RD వడ్డీ కంటే కేవలం 2% ఎక్కువ) ఉంటుంది.
ముందస్తు విత్‌డ్రా: అత్యవసర పరిస్థితి వస్తే, 3 ఏళ్ల తర్వాత ఈ ఖాతాను క్లోజ్ చేసే వెసులుబాటు ఉంది.
నామినీ సౌకర్యం: ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే నామినీ ఆ ఖాతాను కొనసాగించవచ్చు లేదా డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు.
రూ. 15 లక్షల ఫండ్ – లెక్కలు ఇలా..
మీరు ప్రతిరోజూ రూ. 300 పొదుపు చేయగలిగితే అది నెలకు రూ. 9,000 అవుతుంది. ఈ మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో ఇన్వెస్ట్ చేస్తే:
5 ఏళ్ల తర్వాత: మీరు జమ చేసే అసలు రూ. 5.40 లక్షలు. వడ్డీతో కలిపి సుమారు రూ. 6.4 లక్షలు అవుతుంది.
10 ఏళ్ల తర్వాత (పొడిగిస్తే):
మీరు జమ చేసే మొత్తం అసలు: రూ. 10,80,000
మీకు వచ్చే వడ్డీ మాత్రమే: రూ. 4,40,889
మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి వచ్చే మొత్తం: రూ. 15,20,889
గమనిక: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వడ్డీ రేట్లు త్రైమాసికానికి ఒకసారి మారవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు మీ సమీప పోస్ట్ ఆఫీస్‌లో తాజా వివరాలను సరిచూసుకోండి.